Advertisement

  • డివిలియర్స్ వల్లనే ఆ రోజు నేను డబుల్ సెంచరీ చేసే అవకాశం కోల్పోయాను ..గేల్

డివిలియర్స్ వల్లనే ఆ రోజు నేను డబుల్ సెంచరీ చేసే అవకాశం కోల్పోయాను ..గేల్

By: Sankar Thu, 25 June 2020 5:59 PM

డివిలియర్స్ వల్లనే ఆ రోజు నేను డబుల్ సెంచరీ చేసే అవకాశం కోల్పోయాను ..గేల్



క్రిస్ గేల్ ..ఈ పేరు చెప్తే అతడు ఆడే భారీ ఇన్నింగ్స్లు కళ్ళ ముందు మెదులుతాయి ..భారీ సిక్సర్లతో విరుచుకుపడుతూ మెరుపు వేగంతో బ్యాటింగ్ చేసే గేల్ అంటే బౌలర్లు బౌలింగ్ వేయడానికి జంకుతారు ..ఐపీయల్ లో అత్యధిక సిక్సర్ల వీరుడిగా ఉన్న గేల్ ఎన్నో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు ..అలాంటి మెరుపు ఇన్నింగ్సలలో ముఖ్యమైనది పూణే వారియర్స్ మీద చేసిన 175 పరుగులు ..ఆ మ్యాచ్ లో తన విశ్వరూపం ప్రదర్శించిన గేల్ ఐపీయల్ చరిత్రలోనే గాక టి ట్వంటీ చరిత్రలోనే అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్ సాధించాడు ..అయితే ఆ మ్యాచ్ల్లో డబల్ సెంచరీ చేసే అవకాశం కొద్దిలో మిస్ అయింది అని గేల్ పేర్కొన్నాడు..

ఆ మ్యాచ్‌లో ఫస్ట్ రెండు ఓవర్లు ముగిసిన తర్వాత వర్షం కాసేపు అంతరాయం కలిగించింది. దాంతో.. డ్రెస్సింగ్‌ రూములోకి వెళ్లిన నేను.. సహచర క్రికెటర్‌ రామ్‌పాల్‌తో ఒక మాట చెప్పాను. బ్యాటింగ్‌కి పిచ్‌ చాలా అనువుగా ఉంది.. కాబట్టి మ్యాచ్‌లో గెలవాలంటే టీమ్ కనీసం 170-180 పరుగులు చేయాలన్నాను. కానీ.. మ్యాచ్ ముగిసే సమయానికి నా ఒక్కడి స్కోరు 175 పరుగులు. ఆ మ్యాచ్‌లో డివిలియర్స్ ఆఖర్లో బ్యాటింగ్‌కి రాకుండా ఉండింటే.. నేను డబుల్ సెంచరీ అందుకునేవాడ్ని’’ అని క్రిస్‌గేల్ వెల్లడించాడు.

ఇక ఆ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు.. క్రిస్‌గేల్ (175 నాటౌట్) జోరుతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 263 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో తడబడిన పుణె వారియర్స్ ఆఖరికి 133/9తో సరిపెట్టింది.అయితే గేల్ తర్వాత ఎవ్వరు ఆ స్కోర్ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయారు ..

Tags :
|
|

Advertisement