Advertisement

రెండో విదేశీ క్రికెటర్‌గా క్రిస్ గేల్...?

By: chandrasekar Mon, 21 Sept 2020 10:20 AM

రెండో విదేశీ క్రికెటర్‌గా క్రిస్ గేల్...?


విధ్వంసక బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్ అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. మరో 16 పరుగులు సాధిస్తే 4500 పరుగుల మైలురాయిని చేరిన రెండో విదేశీ క్రికెటర్‌గా నిలవనున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)లో కరీబియన్ ఆటగాడు, విధ్వంసక బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్ అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో విదేశీ ఆటగాడు గేల్. మరో 16 పరుగులు సాధించాడంటే.. ఐపీఎల్‌లో 4500 పరుగుల మైలురాయిని వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ చేరుకుంటాడు. గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లకు ప్రాతినిథ్యం వహించిన క్రిస్ గేల్ ప్రస్తుతం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కు ఆడుతున్నాడు.

ఐపీఎల్‌లో మొత్తం 125 మ్యాచ్‌లాడిన గేల్ 4,484 పరుగులు సాధించాడు. మరో 16 పరుగులు సాధిస్తే 4,500 మార్కు చేరుకున్న రెండో విదేశీ క్రికెటర్‌గా క్రిస్ గేల్ నిలవనున్నాడు. అంతకుముందు డేవిడ్ వార్నర్ (4,706) ఒక్కడే ఈ ఘనత సాధించాడు. కాగా, ఓవరాల్‌గా ఐపీఎల్‌లో ఆ మార్క్ చేరుకున్న ఆరో బ్యాట్స్‌మన్‌గా కరీబియన్ వీరుడు అరుదైన జాబితాలో చోటు దక్కించుకుంటాడు. విరాట్ కోహ్లీ (5,412), సురేశ్ రైనా (5,368) మాత్రమే 5 వేల మార్కు చేరుకున్నారు.

Tags :

Advertisement