Advertisement

  • చిరంజీవి క్వారంటైన్ లో ఉండాల్సిందే ...వైద్య ఆరోగ్య శాఖ

చిరంజీవి క్వారంటైన్ లో ఉండాల్సిందే ...వైద్య ఆరోగ్య శాఖ

By: Sankar Sun, 15 Nov 2020 3:09 PM

చిరంజీవి క్వారంటైన్ లో ఉండాల్సిందే ...వైద్య ఆరోగ్య శాఖ


మెగాస్టార్ చిరంజీవి కి ఇటీవల కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. చిరు కి కరోనా అని తెలిసి ఆయన అభిమానులు ఆందోళన చెందారు. చిరు కి ఎలాంటి లక్షణాలు లేకున్నా పాజిటివ్ వచ్చింది.మెగాస్టర్ త్వరగా కొలుకోవాలని ఫ్యాన్స్ ప్రత్యక పూజలు కూడా చేసారు.

మెగాస్టార్ కు చేసిన టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత తిరిగి టెస్ట్ చేయించుకుంటే నెగిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని మెగాస్టార్ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. అయితే ఒక్కసారి పాజిటివ్ అని వచ్చి తిరిగి నెగిటివ్ వచ్చిన తప్పనిసరిగా క్వారంటైన్ లో చిరంజీవి ఉండాల్సిందే అని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నిబంధనల ప్రకారం చిరంజీవి క్వారంటైన్ లో ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఇదిలా ఉంటే దీపావళి సందర్భంగా మెగాస్టార్ తన గురువు అయిన కళాతపస్వి కె విశ్వనాథ్ ను కలిశారు. ఈ సందర్భంగా చిరంజీవి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Tags :

Advertisement