Advertisement

  • ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోలుకోవాలని చిరంజీవి భావోద్వేగ పోస్టు

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోలుకోవాలని చిరంజీవి భావోద్వేగ పోస్టు

By: Dimple Tue, 18 Aug 2020 11:26 PM

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోలుకోవాలని చిరంజీవి భావోద్వేగ పోస్టు

కరోనాతో పోరాడుతున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై ప్రముఖ కథానాయకుడు చిరంజీవి, సినీ గేయ రచయిత సిరివెన్న సీతారామాశాస్త్రి వేర్వేరుగా స్పందించారు. చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బాలూతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు చిరంజీవి భావోద్వేగ వీడియోను విడుదల చేశారు.

‘‘కోటానుకోట్ల మంది అభిమాన గాయకుడు, దేశం గర్వించే అత్యుత్తమ కళాకారుడు, నా సోదర సమానుడైన ఎస్పీ బాలు రోజురోజుకీ కోలుకుంటున్నారని, వైద్యానికి స్పందిస్తున్నారని విని సంతోషిస్తున్నా. ఆ సంతోషాన్ని మీతో పంచుకుందామనీ ఇలా మీ ముందుకొచ్చాను. బాలుతో నాకు సినిమా పరంగానే అనుబంధం కాదు.. కుటుంబపరంగానూ ఎంతో సాన్నిహిత్యం ఉంది. చెన్నైలో పక్కపక్క వీధుల్లోనే ఉంటూ తరచూ కలుసుకుంటుండేవాళ్లం. ఎన్నో సంవత్సరాల వ్యక్తిగత అనుబంధం మాది. తనని నేను అన్నయ్యా అంటూ ఆత్మీయంగా పిలుస్తుంటాను.

అలాగే, ఆయన చెల్లెల్లు ఎస్పీ వసంత, శైలజలు కూడా నన్ను అన్నయ్యగానే చూసుకుంటుంటారు. బాలు ఆరోగ్య పరిస్థితిని గత మూడు రోజులుగా ఎస్పీ వసంత, శైలజ, శుభలేఖ సుధాకర్‌లతో మాట్లాడి తెలుసుకుంటూనే ఉన్నాను. ఈ రోజు కూడా వాళ్లతో మాట్లాడాను. బాలు ఆరోగ్యం మెరుగుపడుతోందని వారు చెప్పిన మాటలు నాకెంతో తృప్తినిచ్చాయి. ఆ మాటలు నాకెంతో సంతోషాన్నిచ్చాయి.

చంద్రబాబువన్నీ కట్టుకథలు - మంత్రి మేకతోటి సుచరిత

chiranjeevi,emotional,video,on spb,health ,ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోలుకోవాలని చిరంజీవి భావోద్వేగ పోస్టు

ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించి టీడీపీ అధ్యక్షుడు నారాచంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణల నేపథ్యంలో అందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని కోరి 24 గంటలు గడిచినా ఏ ఆధారాలు సమర్పించలేకపోయారని హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. హోంమంత్రిగా తాను, రాష్ట్ర డీజీపీకి విజ్ఞప్తిచేసి 24 గంటలు గడిచిపోయిందని, అయినా ఈ క్షణం వరకూ ఎటువంటి ఆధారాలూ సమర్పించలేకపోయారని పేర్కొన్నారు. అయితే కొన్ని మీడియా సంస్థలతో కలిసి వారు చేస్తున్న ఒక కుట్రపూరితమైన ప్రచారం వెనుక ఏ వ్యూహం దాగిఉందన్న అంశాన్ని రాష్ట్ర ప్రజలముందు ఉంచటం తన విధిగా భావిస్తున్నానని ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు.

‘మీ అందరికీ తెలుసు. అమరావతిలో చంద్రబాబునాయుడు, ఆయన బినామీలు, ఆయన సన్నిహితులు ఎంతటి భారీ కుంభకోణానికి పాల్పడ్డారన్నది. అయితే అందుకు సంబంధించి పూర్తిస్థాయి విచారణను మేం అధికారంలోకి రాగానే చేపడతామని చెప్పిన మేరకు రాష్ట్ర పోలీసులోని సంబంధిత విభాగాలు ఈ విషయంపై పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. విచారణను ఒక కొలిక్కి తీసుకు వస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడు, ఆయన బినామీలు ఈ నివేదికలో నిజాలను ప్రజలకు తెలియకుండా మరుగుపరచాలన్న దురుద్దేశంతో పెద్ద కుట్రకు తెరతీసినట్టుగా మాకు కనిపిస్తోంది. ఇంటా, బయటా తనకున్న పరిచయాలను, తనకు సహకరించే వారిని ఉపయోగించుకుంటూ, మీడియా సంస్థలతో కలిసి చేస్తున్న ఈకుట్ర వల్ల ఆయన పొందాలనుకుంటున్న ప్రయోజనాలను ఎట్టి పరిస్థితుల్లో పొందలేరని స్పష్టంచేస్తున్నాను.

అమరావతి భూముల చుట్టూ అసలైన కుంభకోణాన్ని వెలికి తీయకుండా నిరోధించేందుకు, దర్యాప్తు ముందుకు సాగనీయకుండా అడ్డుకునేందుకు, పోలీసు, ప్రభుత్వ యంత్రాంగం మీద ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణల ద్వారా వారిని లక్ష్యంగా చేసుకున్నారు. వారి స్థైర్యాన్ని దెబ్బతీయాలనే ఈ కుట్రపూరిత వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో చంద్రబాబు మీడియా భాగస్వాములు, మరికొందరు ఇంటా, బయటా సహకరించే వ్యక్తులు ఉన్నారని అందరికీ అర్థమవుతోంది. కాబట్టి చట్టవిరుద్ధమైన ఫోన్‌ ట్యాపింగ్‌ జరుగుతుందనేది అబద్ధం. ఈ విషయాలు అందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాను. అమరావతి ల్యాండ్‌ స్కాంనుంచి తప్పించుకునేందుకు ఇటువంటి ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబు, ఆయన బినామీలు, ఆయన సన్నిహితులు తప్పించుకోలేరని, అధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరని స్పష్టంచేస్తున్నాను’ అని సుచరిత పేర్కొన్నారు.

Tags :
|
|

Advertisement