Advertisement

  • దూసుకుపోతున్న చింగారి యాప్ ...మూడు రోజుల్లోనే అయిదు లక్షల డౌన్ లోడ్స్

దూసుకుపోతున్న చింగారి యాప్ ...మూడు రోజుల్లోనే అయిదు లక్షల డౌన్ లోడ్స్

By: Sankar Fri, 03 July 2020 12:53 PM

దూసుకుపోతున్న చింగారి యాప్ ...మూడు రోజుల్లోనే అయిదు లక్షల డౌన్ లోడ్స్



భారతదేశానికి-,చైనా మధ్య జరుగుతున్న సంఘర్షణల నేపథ్యంలో కేంద్రం చైనాకు చెందిన 59 యాప్స్ ను నిషేంధించిన విషయం తెలిసిందే ..ఇందులో యువతకు అత్యంత ఇష్టమైన టిక్ టాక్ కూడా ఒకటి ..దేశంలో ఉన్న యువతలో చాలా మంది అన్నం తినకుండా అయినా బతికారు గాని , టిక్ టాక్ వీడియో చేయకుండా మాత్రం ఉండలేకపోయారు ..టిక్ టాక్ ఎందరిలో స్టార్ లను చేసింది ..ఎందరికో సినిమాల్లో , షార్ట్ ఫిలిం లలో అవకాశాలు వచ్చేలా చేసింది .దీనితో టిక్ టాక్ బ్యాన్ అవడంతో ఎం చేయాలో అర్థంగాని యువత వెంటనే దానికి ప్రత్యామ్నాయాన్ని వెతికారు ..

ఈ క్రమంలో పాపులర్ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ స్థానంలో భారతదేశానికి చెందిన 'చింగారీ' యాప్ డౌన్‌లోడ్స్‌లో రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు ప్లేస్టోర్‌లోనే కోటి డౌన్‌లోడ్స్ పూర్తి చేసుకోవడం విశేషం. గత పదిరోజుల్లో ఈ యాప్‌ను 30 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకోగా.. గడిచిన 72 గంటల్లోనే దాదాపు 5 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేశారు.

బెంగళూరుకు చెందిన బిస్వాత్మ నాయక్, సిద్దార్థ్ గౌతమ్ గతేడాది 'చింగారీ' యాప్‌ను రూపొందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేడ్‌ ఇన్‌ ఇండియా యాప్‌ అయిన్‌ ‘చింగారీ’ని డౌన్‌లోడ్‌ చేసుకోవడం సంతోషంగా ఉంది. చైనాకు చెందిన యాప్స్‌ని నిషేధించాలన్న వాదన మొదలైన దగ్గర్నుంచీ 'చింగారీ' యాప్‍కు యూజర్లు పెరిగారు. గత కొన్ని రోజులుగా సబ్‌స్క్రైబర్స్ 400 శాతం పెరిగారు. ఈ యాప్‌లో వీడియోలు అప్‌లోడ్, డౌన్‌లోడ్ చేయొచ్చు. స్నేహితులకు షేర్ చేయొచ్చు. ఫ్రెండ్స్‌తో చాట్‌ చేయడంతో పాటు కొత్త వారితో ఇంటరాక్ట్ కూడా కావొచ్చు’ అని తెలిపారు. ‘చింగారీ’ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, బంగ్లా, మళయాళం లాంటి భాషల్లో ఉపయోగించొచ్చు..

Tags :
|

Advertisement