Advertisement

  • వాస్తవాధీన రేఖ వెంబడి వేట కొడవళ్లతో వున్న చైనా సైనికులు

వాస్తవాధీన రేఖ వెంబడి వేట కొడవళ్లతో వున్న చైనా సైనికులు

By: chandrasekar Wed, 09 Sept 2020 09:12 AM

వాస్తవాధీన రేఖ వెంబడి వేట కొడవళ్లతో వున్న చైనా  సైనికులు


భారత్ మరియు చైనా వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న ఘర్షణ కారణంగా ఇరు దేశాలు అధిక సంఖ్యలో సైన్యాన్ని మోహరించిన విషయం తెలిసిందే. చైనా ఎప్పుడు నీతి మాటలు చెపుతూ కుట్ర చర్యలకు ప్రయత్నిస్తూనే వుంది. కయ్యాలమారి చైనాకు యుద్ధనీతి లేదన్న సత్యం మరోసారి నిర్థారణ అయ్యింది. నక్కజిత్తులు ప్రదర్శిస్తున్న డ్రాగన్ దేశం ఓ వైపు శాంతి జపం వల్లిస్తున్నట్లు నటిస్తూనే మరోవైపు వేట కొడవళ్లు బిగించిన కర్రలతో తమ దేశ సైనికులను దేశ సరిహద్దుల్లో మోహరించింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) జవాన్లు వేట కొడవళ్లు బిగించిన కర్రలతో తూర్పు లద్ధఖ్ సెక్టార్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి నిల్చొని ఉన్న ఫోటోలు భారత మీడియాకు లభించాయి. మన దేశాన్ని రెచ్చ గొడుతూనే వుంది.

ఇటు సంప్రదింపులు జరుపుతూ మరోపక్క విద్రోహ చర్యలకు ప్రయత్నిస్తూ వుంది. గల్వాన్ లోయలో అమలు చేసిన ప్లాన్‌నే ఇప్పుడు మరోసారి అమలు చేసేందుకు కయ్యాలమారి చైనా కుట్రపన్నుతున్నట్లు ఈ ఫోటో ద్వారా తేటతెల్లం అవుతోంది. దేశ సరిహద్దుల్లో ఇరు దేశాల సైనిక బలగాల మోహరింపుతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. భారత ఆర్మీ గాల్లోకి కాల్పులు జరిపినట్లు డ్రాగన్ దేశం చేసిన ఆరోపణలపై భారత సైన్యం తోసిపుచ్చింది. గత జూన్ 15న గల్వాన్ లోయలో ఇరు దేశాల సేనల మధ్య జరిగిన ఘర్షణల్లో కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. నాడు కూడా భారత జవాన్లపై ఇనుపకంచెను చిట్టిన కర్రలతో చైనా జవాన్లు ముందస్తు ప్రణాళికతో విరుచుకపడ్డారు. భారత జవాన్లు సైతం ధీటుగా స్పందించడంతో చైనా వైపు కూడా భారీగానే ప్రాణ నష్టం జరిగింది. మన దేశం కూడా గట్టి నిఘా వేయడంతో చైనా జీర్ణించుకోలేక రక రకాలుగా కుట్ర పన్నుతున్నాయి.


Tags :

Advertisement