Advertisement

  • చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ తన పాకిస్థాన్ పర్యటన వాయిదా

చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ తన పాకిస్థాన్ పర్యటన వాయిదా

By: chandrasekar Sat, 05 Sept 2020 5:17 PM

చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ తన పాకిస్థాన్ పర్యటన వాయిదా


పాకిస్థాన్‌లోని చైనా రాయబారి యావో జింగ్ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తన పాకిస్థాన్‌ పర్యటన వాయిదా వేసుకున్నట్లు తెలిపారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఇరు దేశ ప్రభుత్వాలను సంప్రదించి త్వరలో కొత్త షెడ్యూల్‌ ఖరారు చేస్తామని తెలిపారు. పింగ్‌ను పాక్‌ పర్యటనకు ఆ దేశ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ఆహ్వానించిన విషయం తెలిసిందే. పర్యటన జరిగి ఉంటే కొన్నినెలలుగా తూర్పు లడఖ్‌లో భారత్‌-చైనా సరిహద్దు ఉద్రిక్తతలపైనా చర్చ జరిగి ఉండేదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఆగష్టు 29, 30 రాత్రి లడఖ్‌లోని పాంగాంగ్‌ ప్రాంతంలోకి చొరబాటుకు యత్నించిన చైనా దళాలను భారత సైన్యం అడ్డుకుంది. ఫింగర్ ఏరియా, గాల్వన్ వ్యాలీ, హాట్ స్ప్రింగ్స్, కొంగ్రంగ్ నాలాతో సహా పలు ప్రాంతాల్లో చైనా సైన్యం ఆక్రమణకు ప్రయత్నిస్తూనే ఉంది. జూన్లో గాల్వన్ లోయలో భారత్‌-చైనా దళాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు మృతి చెందిన విషయం తెలిసిందే.

Tags :
|

Advertisement