Advertisement

  • చైనా సైన్యం దుస్సాహాసాలకు సమర్ధంగా బదులివ్వడానికి సిద్ధంగా ఉండాలి: రాజ్‌నాథ్ సింగ్

చైనా సైన్యం దుస్సాహాసాలకు సమర్ధంగా బదులివ్వడానికి సిద్ధంగా ఉండాలి: రాజ్‌నాథ్ సింగ్

By: chandrasekar Mon, 22 June 2020 10:14 AM

చైనా సైన్యం దుస్సాహాసాలకు సమర్ధంగా బదులివ్వడానికి సిద్ధంగా ఉండాలి: రాజ్‌నాథ్ సింగ్


లడఖ్‌లో నెలకున్న పరిస్థితులపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్ సహా త్రివిధ దళాలకు చెందిన అధిపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చైనా కార్యకలాపాలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. జల, వాయు, భూమార్గాల ద్వారా చైనాను చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. డ్రాగన్ ఎలాంటి దుశ్చర్యలకు ప్రయత్నించినా దీటుగా బదులివ్వాలని ఆజ్ఞాపించారు.

చైనా సైన్యం దుస్సాహాసాలకు సమర్ధంగా బదులవ్వడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. చైనా సరిహద్దుల్లో వ్యూహాత్మక విధానం అవలంభించాలని పేర్కొన్నారు. ఈ విషయంలో సాయుధ దళాలకు పూర్తి స్వేచ్ఛను ఇస్తూ రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

తూర్పు లడఖ్, ఇతర ప్రాంతాల్లో చైనా ఎలాంటి సాహసం చేసినా తగిన సమాధానం ఇవ్వడానికి భారత దళాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గాల్వన్ లోయ పెట్రోలింగ్ పాయింట్ 14 సమీపంలో ఉన్న ప్రాంతంపై భారత సైన్యం ఇప్పుడు పట్టు సాధించిందని అధికారిక వర్గాలు శనివారం వెల్లడించాయి. ఇక్కడే వాగ్వాదం మొదలై ఘర్షణకు దారితీసి రక్తపాతం చోటుచేసుకుంది.

జూన్ 15న 20 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోగా, 76 మంది గాయపడ్డారని ఆర్మీ వెల్లడించింది. ఘర్షణ జరిగిన గాల్వన్ లోయ వద్ద ఇరు దేశాల సైనిక నిర్మాణాలు ఉండటంతో అంత త్వరగా ఉద్రిక్తతలు తగ్గవని అధికార వర్గాలు తెలిపాయి. రష్యాలో నిర్వహించే విక్టరీ డే పరేడ్‌లో పాల్గొనేందుకు రాజ్‌నాథ్ సోమవారం బయలుదేరి వెళ్లనున్నారు.

Tags :
|

Advertisement