Advertisement

  • ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో యుధ్దాన్ని కోరుకోవడం లేదన్న చైనా అధ్యక్షుడు

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో యుధ్దాన్ని కోరుకోవడం లేదన్న చైనా అధ్యక్షుడు

By: chandrasekar Wed, 23 Sept 2020 10:32 AM

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో యుధ్దాన్ని కోరుకోవడం లేదన్న చైనా అధ్యక్షుడు


ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో తాము యుధ్దాన్ని కోరుకోవడం లేదని చైనా అధ్యక్షుడు తెలిపారు. సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతూనే శాంతి మంత్రం జపించింది డ్రాగన్ చైనా. గత కొద్దిరోజులుగా తూర్పు లడాఖ్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇరుదేశాల అధికారుల మధ్య విడతలవారీగా చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ వైఖరికి విభిన్నంగా శాంతి అంటూ కామెంట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటు భారత్ బలగాల దూకుడు, అటు అగ్రరాజ్యం అమెరికా కన్నెర్ర చేయడంతో చైనా ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తుంది. ఐక్యరాజ్యసమితి 75వ సర్వసభ్య సమావేశం సందర్భంగా జిన్ పింగ్ మాట్లాడారు.

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ సందర్భంగా నేతలంగా వర్చువల్ విధానంలో వీడియో సందేశం పంపించారు. జిన్ పింగ్ కూడా అదేవిధంగా మేసెజ్ సెండ్ చేశారు. తమకు కోల్డ్ వార్, హాట్ వార్ ఏదీ అవసరం లేదని తాము యుధ్దాన్ని కోరుకోవడం లేదని వైఖరిని కుండబద్దలు కొట్టీ మరీ చెప్పారు. అయితే దేశాల మధ్య బేదాభిప్రాయాలు ఉండటం సహజమేనని జిన్ పింగ్ అంగీకరించారు. వాటిని చర్చలతో పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ది చెందుతోన్న చైనా శాంతియుత, సహకార సంబంధ అభివృద్దికి కట్టుబడి ఉందని చెప్పారు. చైనా ఎప్పటికీ విస్తరణ, ఆధిపత్యాన్ని కోరుకోదు అని చెప్పారు. అదే సమయంలో ఇతర దేశాలతో ఉన్న విభేదాలను తగ్గించుకుంటామని తెలిపారు. చర్చలతో వివాదాలను పరిష్కరించుకుంటామని పేర్కొన్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్త నెలకొన్న సమయంలో జిన్ పింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ మాటలు చెపుతూనే అధిక మొత్తంలో సైన్యాన్ని సరిహద్దు వెంబడి చైనా మోహరిస్తూవుంది.

Tags :
|

Advertisement