Advertisement

ట్రంప్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన చైనా

By: Sankar Mon, 22 June 2020 6:41 PM

ట్రంప్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన చైనా



అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏది మాట్లాడిన సంచలనమే ..కరోనా వైరస్ విషయంలో చైనా మీద మరియు వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ మీద తీవ్ర విమర్శలు చేసిన ట్రంప్ , మరోసారి చైనానే లక్ష్యంగా విమర్శలు గుప్పించాడు ..ముందు నుంచి కూడా కరోనా వైరస్ విషయంలో ట్రంప్ చైనా వైఖరిని తప్పు పడుతూనే ఉన్నాడు ..చైనానే కావాలని ఆ వైరస్ ను తయారు చేసింది అని , కరోనా విషయంలో ముందుగానే ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయలేదు అని ఇలా అనేక విమర్శలు చేసాడు ..

అయితే ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చైనాను ఉద్దేశిస్తూ కరోనా వైరస్‌కు కుంగ్ ఫ్లూ అనే పేరు పెట్టిన విషయం తెలిసిందే. అంతేకాకుండా కోవిడ్‌కు 20 రకాల కొత్త పేర్లు పెట్టామని, దానిని వూహాన్‌ వైరస్‌ అంటూ నామకరణం చేసింది కూడా తామేనంటూ రెచ్చగొట్టే రీతిలో ప్రకటనలు చేశారు. ఇటీవల ఓక్లహామాలోని టల్సాలో నిర్వహించిన మొదటి ఎలక్షన్ ర్యాలీలో పాల్గొన్న ట్రంప్‌ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

దీనిపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కుంగ్ ఫ్లూ అనే వ్యాఖ్యలను ట్రంప్‌ వెనక్కి తీసుకోవాలని లేకపోతే భవిష్యత్‌లో తీవ్ర పరిణామలు ఎదుర్కొక తప్పదని డ్రాగన్‌ హెచ్చరించింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ శాఖ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ దేశాలను చుట్టుముట్టిన కరోనా వైరస్‌ను తమ కుట్రగా అమెరికా భావించడం సరైనది కాదంటూ పేర్కొంది. చైనాపై లేనిపోని విమర్శలు చేసి అధ్యక్ష ఎన్నికల్లో లబ్ధి పొందాలని ట్రంప్‌ భావిస్తున్నారంటూ మండిపడింది. కాగా చైనాలో కుంగ్ ఫూ అనే మార్షల్ ఆర్ట్స్ ఎంతో ప్రత్యేకమైనదన్న విషయం తెలిసిందే.

Tags :
|
|
|

Advertisement