Advertisement

  • మా వాళ్లకు నోబెల్ శాంతి బహుమతి ఇస్తే బాగోదు.. నార్వే కు వార్నింగ్ ఇచ్చిన చైనా

మా వాళ్లకు నోబెల్ శాంతి బహుమతి ఇస్తే బాగోదు.. నార్వే కు వార్నింగ్ ఇచ్చిన చైనా

By: Sankar Sun, 30 Aug 2020 2:20 PM

మా వాళ్లకు నోబెల్ శాంతి బహుమతి ఇస్తే బాగోదు.. నార్వే కు  వార్నింగ్ ఇచ్చిన చైనా


చైనా నోబెల్ శాంతి బహుమతి విషయంలో నార్వే కు వార్నింగ్ ఇచ్చింది..మావాళ్లకు కనుక నోబెల్‌ శాంతిబహుమతి ఇచ్చి మాలో మాకు పెట్టారో మీకు మనశ్శాంతి లేకుండా చేస్తాం అని చైనా ఫారిన్‌ మినిస్టర్‌ వాంగ్‌ ఇ నార్వేను గట్టిగా బెదిరించారు. ‘మాలో మాకు’ అంటే.. చైనాకు, హాంకాంగ్‌కి. హాంకాంగ్‌ ఒక ప్రత్యేక దేశంలా అనిపిస్తుంది కానీ అది చైనా పాలనాధికారాల కింద ఉన్న ప్రత్యేక ప్రాంతం మాత్రమే.

ఈమధ్య చైనా ఒక కొత్త భద్రత చట్టం తెచ్చింది. దానిని హాంకాంగ్‌ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. నిరసన ప్రదర్శనలు జరుపుతూనే ఉన్నారు. ఆ నిరసనకారులకు నార్వే నోబెల్‌ కమిటీ ‘అండ్‌.. ఈ ఏడాది శాంతి బహుమతి గోస్‌ టు..’ అంటూ అవార్డును ప్రకటించే ప్రమాదం ఉందని చైనా స్మెల్‌ చేసినట్లుంది..అందుకే ఈ ముందు జాగ్రత్త బెదిరింపులు.

ఈ మధ్య బ్రిటన్‌కి కూడా చైనా ఇలాగే వార్నింగ్‌ ఇచ్చింది. ‘మీ మంచితనం చేత మా మంచివాళ్లని మీ మంచి దేశంలో ఉండటానికి రప్పించుకుంటే మామూలుగా ఉండదు చూడండీ..’ అని టెస్ట్‌ ఫైర్‌ లేవో చేసింది. ఇప్పుడు నార్వేకు తాజాగా ‘శాంతి సందేశం’ ఇచ్చింది. అయినా నోబెల్‌ ఇచ్చేది స్వీడన్‌ కదా. మధ్యలోకి నార్వే ఎందుకొచ్చింది? పెద్దాయన ఆల్ఫెడ్ర్‌ నోబెల్‌ అలా వీలునామా రాసి వెళ్లారు.

Tags :
|
|
|
|

Advertisement