Advertisement

  • కరోనా వ్యాక్సిన్ ను అత్యవసర జాబితాలో చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న చైనా

కరోనా వ్యాక్సిన్ ను అత్యవసర జాబితాలో చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న చైనా

By: Sankar Wed, 07 Oct 2020 07:13 AM

కరోనా వ్యాక్సిన్ ను అత్యవసర జాబితాలో చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న చైనా


కరోనా చికిత్సకు దేశీయంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లను అంతర్జాతీయంగా అత్యవసర వినియోగ జాబితాలో చేర్చడానికి చైనా ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)తో చర్చలను జరుపుతున్నది. అత్యవసర వినియోగ జాబితాలోకి చేర్చిన టీకాలపై పరీక్షలు, లైసెన్సుల జారీ వంటి ప్రక్రియలు వేగంగా జరుగటమేగాక అవి ప్రజలకు వీలైనంత త్వరలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటారు. క్లినికల్ ట్రయల్స్ చివరి దశలో చైనాలో కనీసం నాలుగు ప్రయోగాత్మక వ్యాక్సిన్లు ఉన్నాయి.

చైనా నేషనల్ బయోటెక్ గ్రూప్ (సీఎన్జీబీ), సినోవాక్ బయోటెక్, కాన్సినో బయోలాజిక్స్ తయారు చేస్తున్నాయి. వీటిని పాకిస్థాన్‌, ఇండోనేషియా, బ్రెజిల్, రష్యా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాల్లో వీటిని ప్రయోగించనున్నారు.కాగా చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని గడగలాడిస్తున్న విషయం తెలిసిందే ..ఇండియా , అమెరికా , బ్రెయిలీ వంటి దేశాలు కరోనా దెబ్బకు బాగా బలయ్యాయి

Tags :
|
|

Advertisement