Advertisement

  • పొరుగుదేశంపై సైనిక చర్యకు సిద్ధం అయిన చైనా..సరిహద్దులో భారీగా సైన్యం మోహరింపు

పొరుగుదేశంపై సైనిక చర్యకు సిద్ధం అయిన చైనా..సరిహద్దులో భారీగా సైన్యం మోహరింపు

By: Sankar Mon, 19 Oct 2020 11:11 AM

పొరుగుదేశంపై సైనిక చర్యకు సిద్ధం అయిన చైనా..సరిహద్దులో భారీగా సైన్యం మోహరింపు


పక్కన ఉన్న దేశాలతో ఎప్పుడు ఎదో ఒక గొడవకు దిగుతూ ఉండే డ్రాగన్ దేశం చైనా మరొక దుస్సాహసానికి సిద్ధం అయింది తైవాన్‌పై సైనిక దాడికి పాల్పడేందుకు చైనా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సరిహద్దుల్లోకి భారీగా బలగాలను, ఆయుధాల‌ను త‌ర‌లించిన‌ట్లు స‌మాచారం.

డీఎఫ్‌-11, డీఎఫ్‌-15 క్షిపణుల స్థానంలో అత్యాధునిక హైపర్‌సోనిక్‌ డీఎఫ్‌-17 క్షిపణుల‌ను మోహరించినట్లు రక్షణ రంగ నిపుణులు తెలిపారు. అలాగే ఫుజియాన్‌, గ్వాన్‌డాంగ్‌లోని రాకెట్‌ ఫోర్స్‌, మెరైన్‌ కార్ప్స్ స్థావరాల‌ను సైతం విస్తరించినట్లు కెనడా కేంద్రంగా పనిచేస్తున్న కన్వా డిఫెన్స్‌ రివ్యూ ఉపగ్రహ చిత్రాల ఆధారంగా తెలుస్తోంది. ఇటీవల తైవాన్‌ సరిహద్దుల్లో చైనా సైనిక విన్యాసాల‌ను సైతం అధికం చేసింది.

వాస్తవానికి తైవాన్‌ ఎన్నడూ చైనా పాలన కిందలేదు.. అక్కడ స్వయం పాలనే కొనసాగుతోంది. అయినా అది తమ దేశంలో అంతర్భాగమని చైనా వాదిస్తోంది. తైవాన్‌ను హస్తగతం చేసుకునేందుకు సైనిక చర్య అవకాశాన్ని కొట్టిపారేయలేమని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ వ్యాఖ్యానించారు. ఆ ప్రాంతంలోని ఫుజియాన్‌, గువాంగ్‌డాంగ్‌లోని మెరీన్‌ కోర్‌, రాకెట్‌ ఫోర్స్‌ బలగాలను డ్రాగన్‌ భారీగా పెంచినట్లు కెనడాకు చెందిన కన్వా డిఫెన్స్ రివ్యూ ఉపగ్రహ చిత్రాలను బట్టి స్పష్టమవుతోంది

Tags :
|
|
|

Advertisement