Advertisement

వ్యాక్సిన్‌ తయారీలో చైనా మరో ముందడుగు...!

By: chandrasekar Thu, 08 Oct 2020 4:54 PM

వ్యాక్సిన్‌ తయారీలో చైనా మరో ముందడుగు...!


కరోనా మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్‌ తయారీలో చైనా మరో ముందడుగు వేసి౦ది. చైనీస్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ బయాలజీ అభివృద్ధి చేసిన చైనీస్ ప్రయోగాత్మక కరోనా వైరస్ వ్యాక్సిన్ క్లినికల్‌ ట్రయల్స్‌లో సురక్షితం అని తేలింది.

18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు గల 191 మంది వలంటీర్లకు వాక్సిన్ ఇచ్చారు. ఎవ్వరిలోనూ ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదని పరిశోధకులు పేర్కొన్నారు. కాగా, క్లినికల్‌ ట్రయల్స్‌ ఇంకా పూర్తికాకుండానే చైనా తమ దేశంలోని ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కు టీకాలు వేసింది. చైనాలో ప్రస్తుతం నాలుగు ప్రయోగాత్మక టీకాలు చివరిదశ క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉన్నాయి.

Tags :
|
|
|

Advertisement