Advertisement

  • చైనా నుంచి ముంచుకొస్తున్న మరో మహమ్మారి ముప్పు ..కరోనా కంటే ప్రమాదకరమైంది

చైనా నుంచి ముంచుకొస్తున్న మరో మహమ్మారి ముప్పు ..కరోనా కంటే ప్రమాదకరమైంది

By: Sankar Mon, 06 July 2020 4:50 PM

చైనా నుంచి ముంచుకొస్తున్న మరో మహమ్మారి ముప్పు ..కరోనా కంటే ప్రమాదకరమైంది



ఇప్పటికే కరోనా మహమ్మారి దెబ్బకు దాదాపు ఆరు నెలలుగా ప్రపంచ దేశాలు తమ పనులు అన్ని మానుకొని కేవలం కరోనా కట్టడి మీదనే ద్రుష్టి పెట్టాయి ..అయితే ఈ కరోనా వైరస్ మొదట చైనాలో బయటపడింది ..కొంతమంది కావాలనే చైనా ఈ వైరస్ ను తయారు చేసింది అని విమర్శలు కూడా చేసారు ..అయితే వుహాన్ లోని ఒక మార్కెట్ నుంచి ఈ వ్యాధి వ్యాపించింది అని చైనా వాదిస్తుంది ..ఈ కరోనా ఇలా ఉండగానే మరొక మహమ్మారి ప్రపంచం మీద దాడి చేసేందుకు సిద్ధంగా ఉంది ..ఈమహమ్మారి కూడా చైనా లోనే పుట్టింది ..

బుబోనిక్‌ ప్లేగు చైనాలో మరోసారి విజృంభించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన కొన్ని కేసులను అక్కడి ఆసుపత్రులు నిర్ధరించాయి. ఇన్నర్‌ మంగోలియా అటానమస్‌ రీజియన్‌లోని బైయన్నూరు ప్రాంతంలో ఇద్దరికి ఈ వ్యాధి నిర్ధారణ కాగా.. వేర్వురు ఆసుపత్రుల్లో ఉంచి చికిత్స అందజేస్తున్నారు. వీరితో కాంటాక్ట్ అయిన 146 మందిని క్వారంటైన్ చేశారు.

జంతువుల నుంచి సంక్రమించే బుబోనిక్ ప్లేగు... జంతువులు లేదా మనుషులకు వ్యాపించగలదు. ఇది వ్యాధి సోకిన గుమ్మడి పురుగు కుట్టినా చనిపోయిన ప్లేగు-సోకిన జంతువు శరీర ద్రవాల వల్ల కూడా ఇది సోకుతుంది. బుబోనిక్ ప్లేగుకు యెర్సినియా పెస్టిస్ అనే బాక్టీరియం బుబోనిక్ ప్లేగు, సెప్టిసెమిక్ ప్లేగు, న్యుమోనిక్ ప్లేగుకు కారణమవుతుంది.

డబ్ల్యూహెచ్ఓ ప్రకారం.. బుబోనిక్‌ ప్లేగును సకాలంలో గుర్తించి వైద్యం అందజేయకపోతే ఇది సోకిన వ్యక్తి 24 గంటల్లో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది..అయితే ఈ మహమ్మారి విషయాన్ని చైనా ఆన్‌లైన్ అధికారిక పత్రిక పీపుల్స్‌ డెయిలీ వెల్లడించింది. దీంతో ఆ ప్రాంతంలో ఈ ఏడాది చివరి వరకు లెవల్‌-3 హెచ్చరికలు జారీ చేయగా.. ఈ విషయాన్ని అక్కడి వైద్యశాఖ సైతం ధ్రువీకరించింది. ప్రజలు తమ వ్యక్తిగత పరిశుభ్రతను మెరుగుపరుచుకోవాలని సూచించింది.

Tags :
|
|
|

Advertisement