Advertisement

  • కరోనా వ్యాక్సిన్ ను తొలిసారి ప్రదర్శనలో ఉంచిన చైనా..

కరోనా వ్యాక్సిన్ ను తొలిసారి ప్రదర్శనలో ఉంచిన చైనా..

By: Sankar Mon, 07 Sept 2020 6:40 PM

కరోనా వ్యాక్సిన్ ను తొలిసారి ప్రదర్శనలో ఉంచిన చైనా..


కరోనా మహమ్మారి జన్మ స్థలం అయిన చైనా ..ఆ మహమ్మారి నిర్ములనకు వ్యాక్సిన్ ప్రయోగాలను ముమ్మరం చేసింది..దీనిలో భాగంగా చైనా తన స్వదేశీ వ్యాక్సిన్‌ను తొలిసారి ప్రదర్శనకు ఉంచింది.

ఆ దేశ రాజధాని బీజింగ్‌లో జరిగిన ట్రేడ్‌ ఫేర్‌లో (వాణిజ్య సంత) వ్యాక్సిన్‌ను ఎగ్జిబిట్‌ చేశారు. ఈ టీకాను చైనా కంపెనీలైన సినోవాక్ బయోటెక్, సినోఫార్మ్ అభివృద్ధి చేశాయి. అయితే, ఇది మార్కెట్‌లోకి ఇంకా అందుబాటులోకి రాలేదు. మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించిన తర్వాత ఈ ఏడాది చివరికల్లా మార్కెట్‌లోకి వస్తుందని తయారీదారులు పేర్కొంటున్నారు.

టీకా ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీని నిర్మించాం. ఇందులో ఏడాదికి 300 మిలియన్ మోతాదులను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. ’ అని సినోవాక్‌ ప్రతినిధి వెల్లడించారు. కాగా, ట్రేడ్‌ ఫేర్‌కు వచ్చిన జనం వ్యాక్సిన్‌ ఉంచిన ప్రదేశం వద్ద పెద్ద సంఖ్యలో గుమిగూడారు. టీకాను చూసి సంబురపడిపోయారు.

Tags :
|
|

Advertisement