Advertisement

  • కరోనా ప్రభావంలో మార్పులు వస్తున్నాయని అంటున్న చైనా

కరోనా ప్రభావంలో మార్పులు వస్తున్నాయని అంటున్న చైనా

By: chandrasekar Thu, 21 May 2020 1:32 PM

కరోనా ప్రభావంలో మార్పులు వస్తున్నాయని అంటున్న చైనా


తాజా సమాచారం ప్రకారం దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో కరోనా నియంత్రణలోకి వచ్చినప్పటికీ గత కొద్ది వారాలుగా.. ఈశాన్య ప్రావిన్సులైన జిలిన్, హీలాంగ్‌జియాంగ్‌లలో నెలకొన్న పరిస్థితి కారణంగా కరోనా రెండోసారి చైనాపై విరుచుకుపడొచ్చని అక్కడి నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా కట్టడి చేశామని చెప్పుకొంటున్న చైనా ప్రభుత్వానికి అక్కడి ఈశాన్య ప్రాంతంలోని కరోనా కేసులు కొత్త సవాలును విసురుతున్నాయి. ప్రభుత్వాధికారులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.

క్యూ హైయబో అత్యవసర చికిత్సలో నిపుణుని అభిప్రాయం. ఈశాన్య ప్రాంతాల్లోని వైరస్‌ ప్రభావంలో కొన్ని స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గతంతో పోలిస్తే..రోగుల్లో వ్యాధి లక్షణాలు బయటపడేందుకు మరింత సమయం పడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా లక్షణాలు తొందరగా బయటపడని కారణంగా ఇటువంటి బాధితులంతా తమకు తెలియకుండానే స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలివిడిగా మెలిగి మరింత మందికి కరోనా సోకేలా చేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

china,corona,effect,changes,virus ,కరోనా, ప్రభావం, చైనా, సమాచారం, దేశంలో


ఈశ్యాన్య ప్రావిన్సుల్లోని బాధితుల శరీరాల్లో వైరస్ వూహాన్‌లోని రోగులతో పోలిస్తే ఎక్కువ కాలం కొనసాగుతోందని తెలిపారు. వీళ్లలో జ్వర లక్షణాలు కనబడకపోయినప్పటికీ.. ఊపిరితిత్తులపై వ్యాధి అధికంగా ప్రతికూల ప్రభావం చూపిస్తోందన్నారు. ఇది విదేశాలను నుంచి చైనాలోకి ప్రవేశించిన వైరస్ అయి ఉండొచ్చిన క్యూ భావిస్తున్నారు. అయితే ఆయన ప్రత్యేకంగా ఓ దేశం పేరును ప్రస్తావించకపోయినప్పటికీ.. ఈ రెండు ప్రావిన్సులు రష్యా సరిహద్దుకు సమీపంలో ఉన్నాయనేది గుర్తించదగిన విషయం.

Tags :
|
|
|

Advertisement