Advertisement

  • చైనా యాప్ లను నిషేధించడం అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలు ఉల్లంఘించడమే ..చైనా

చైనా యాప్ లను నిషేధించడం అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలు ఉల్లంఘించడమే ..చైనా

By: Sankar Thu, 02 July 2020 5:14 PM

చైనా యాప్ లను నిషేధించడం అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలు ఉల్లంఘించడమే ..చైనా



చైనా యాప్‌లపై నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని భారత్‌ సరిచేసుకోవాలని ఆ దేశ వాణిజ్య మంత్రిత్వ శాఖ గురువారం విజ్ఞప్తి చేసింది. డ్రాగన్‌కు చెందిన కంపెనీల పట్ల వివక్ష పూరిత చర్యలు సరికావంటూ అక్కసు వెళ్లగక్కింది. కాగా గల్వాన్‌ లోయలో ఘాతుకానికి పాల్పడి 20 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న చైనాకు భారత్‌ గట్టి షాకిచ్చిన విషయం తెలిసిందే. డ్రాగన్‌కు చెందిన టిక్‌టాక్‌, హెలో వంటి 59 యాప్‌లపై నిషేధం విధించింది..

ఇక ఈ విషయంపై చైనా వాణిజ్య శాఖ అధికార ప్రతినిధి గావో ఫెంగ్‌ గురువారం స్పందించారు. విలేకర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఫెంగ్‌.. భారత్‌ చర్యలు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలు ఉల్లంఘించేవిగా ఉన్నాయని పేర్కొన్నారు. తమ దేశంలో భారత ఉత్పత్తులు, సేవల పట్ల ఎలాంటి వివక్ష ప్రదర్శించడం లేదని.. భారత్‌ సైతం ఇదే విధంగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నామన్నారు.

అయితే యాప్ లను నిషేధించడాన్ని ఐక్యరాజ్యసమితి మాజీ అమెరికా రాయబారి నిక్కీ హేలీ ప్రశంసించారు. చైనా దూకుడుకు భారత్‌ భయపడలేదని తెలిపారు. ఈ క్రమంలో నిక్కీహేలీ ‘టిక్‌టాక్‌తో సహా చైనాకు చెందిన 59 యాప్‌లను నిషేధించడం అభినందనీయం. చైనా దూకుడుకు భారత్‌ భయపడలేదు’ అంటూ ట్వీట్‌ చేశారు.ఈ నిర్ణయాన్ని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్‌ పాంపియో కూడా సమర్థించారు. చైనా యాప్‌లను భారత్‌ నిషేధించడాన్ని తాము స్వాగతిస్తామని.. ఈ నిర్ణయం భారత సమగ్రత, జాతీయ భద్రతకు ఉపకరిస్తుందని పేర్కొన్న సంగతి తెలిసిందే..

Tags :
|
|
|
|

Advertisement