Advertisement

  • వాస్తవ నియంత్రణ వెంబడి ఉధృతిని తగ్గించేందుకు చైనా కొత్త ప్రతిపాదన

వాస్తవ నియంత్రణ వెంబడి ఉధృతిని తగ్గించేందుకు చైనా కొత్త ప్రతిపాదన

By: chandrasekar Tue, 13 Oct 2020 2:55 PM

వాస్తవ నియంత్రణ వెంబడి ఉధృతిని తగ్గించేందుకు చైనా కొత్త ప్రతిపాదన


చైనా కొత్త ప్రతిపాదన భారత్‌ ముందుకు తెచ్చింది. ప్యాగ్యాంగ్‌ ఉత్తర భాగంలోని ఫింగర్‌ 8 నుంచి తమ బలగాలను వెనక్కి తీసుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు చైనా తెలిపింది. అయితే, ఇదే సమయంలో భారత్‌ కూడా ఫింగర్ 4 నుంచి ఫింగర్స్ 2, 3 మధ్య నుంచి తమ సైన్యాన్ని వెనక్కి తీసుకెళ్ళాలి అనే ప్రతిపాదన చేశారు. సరిహద్దులో వాస్తవ నియంత్రణ దాటి భారత భూభాగంలోకి చైనా సైనికులు చొచ్చుకురావడంతో గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణలో భారత సైనికులు 20 మంది వీరమరణం పొందటం, ఇరు దేశాలు సైన్యాన్ని రంగంలోకి దించడం వంటి పరిణామాలతో సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. పలు దఫాలుగా రెండు దేశాల సైనికాధికారులు, విదేశాంగ శాఖ మంత్రుల మధ్య చర్చలు జరిగినప్పటికీ ఉద్రిక్త వాతావరణాన్ని తొలగించలేకపోయారు.

ఎల్‌ఏసీలోమొదటిసారిగా చాలాసార్లు కాల్పులు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాల సైనికుల మధ్య ఏడో రౌండ్‌ కమాండర్‌ స్థాయి చర్చలు జరిగాయి. గతంలో జరిగిన చర్చల్లో ఎలాంటి ఫలితం రాలేదు. దాంతో బలగాల ఉపసంహరణకు రోడ్‌ మ్యాప్‌ తయారుచేయాలని ఇరు దేశాల సైన్యం నిర్ణయించింది. ఘర్షణ ప్రాంతాల నుంచి చైనా తమ సైన్యాన్ని వెనక్కి తీసుకెళ్లాలని ఇప్పటికే భారత్‌ పట్టుబడుతున్నది. దీనివల్ల చైనా కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఈ ప్రతిపాదన ప్రకారం, ఫింగర్‌ 8 నుంచి తమ బలగాలను వెనక్కి రప్పించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపిన చైనా ఇదే సమయంలో ఫింగర్‌ 4 నుంచి ఫింగర్ ‌2,3 మధ్య నుంచి భారత్‌ తమ బలగాలను ఉపసంహరించుకోవాలి. కమాండర్‌ స్థాయి చర్చలు ఫలప్రదంగా ముగిసి సరిహద్దులో ఉద్రిక్తత సమసిపోవాలని చైనా భావిస్తున్నదని ఆ దేశ రక్షణ రంగ నిపుణులు అంటున్నారు.

Tags :
|

Advertisement