Advertisement

  • పంది మాంసం దిగుమతులపై నిషేధం విధించడానికి చైనా సిద్ధం

పంది మాంసం దిగుమతులపై నిషేధం విధించడానికి చైనా సిద్ధం

By: chandrasekar Thu, 11 June 2020 8:37 PM

పంది మాంసం దిగుమతులపై నిషేధం విధించడానికి చైనా సిద్ధం


చైనా, భారత్‌ మధ్య లద్దాఖ్‌ సరిహద్దుల్లో ఉద్రిక్త ప‌రిస్థితులు నెలకొన్న నేపథ్యంలో చైనా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫీవర్‌ (ఏఎస్ఎఫ్‌)కు అడ్డుకట్ట వేయడానికి భారత్‌ నుంచి పందుల మాంసం దిగుమతులపై నిషేధం విధించడానికి చైనా సిద్ధమైందని ఆ దేశ ప్రభుత్వాధికారి ఒకరు మీడియాకు తెలిపారు. పందులు, అడవి పందుల సంబంధిత ఉత్పత్తులపై నిషేధం విధిస్తే తమ దేశ పశువులను సంరక్షించినట్లు అవుతుందని చైనా భావిస్తోంది.

కొన్ని వారాల క్రితం అసోంలోని పందుల్లో భారత పశు వైద్య నిపుణులు ఏఎస్ఎఫ్‌ గుర్తించిన విషయం తెలిసిందే. చైనీయులకు పంది మాంసం కష్టాలొచ్చాయి. రోజువారి డైట్‌‌‌‌లో పంది మాంసం‌‌‌‌ లేనిదే ముద్ద దిగని చైనీయులు మాంసం దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. రేట్లు ఆకాశాన్ని అంటుకోవడంతో వారానికి ఒకసారి మాత్రమే మాంసం తింటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఆఫ్రికన్‌‌‌‌ స్వైన్‌‌‌‌ రావడం, వాతావరణ పరిస్థితుల వల్ల ఫామ్స్‌‌‌‌ను మూసేయటంతో పంది మాంసం కొరత ఏర్పడిందని, అందుకే రేట్లు అమాంతం పెరిగిపోయాయని వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు.

గత ఏడాది పంది మాంసం‌‌‌‌ రేటు ఒక్క ఆగస్టులోనే దాదాపు 46.7 శాతం పెరిగింది. ప్రపంచంలోని సగం పందులను చైనాలోనే పెంచుతారు. గత ఏడాది వచ్చిన ఆఫ్రికన్‌‌‌‌ స్వైన్‌‌‌‌ ఫీవర్‌‌‌‌‌‌‌‌ వల్ల చాలా పందులు చనిపోయాయి. దీంతో పందుల పెంపకాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అధికారులు తెలిపారు. తాజాగా కరోనా నేపథ్యంలో వోల్గా-డ్నేప్ర్ గ్రూప్ ఈ సంవత్సరం 3000పైగా పందులను ఫ్రాన్స్ నుండి చైనాకు పంపించింది. బోయింగ్ 747 కార్గో విమానంలో 10,400 కిలోమీటర్లు విమానాల ద్వారా పందులను రవాణా చేశారు. జంతువులలో ఆఫ్రికన్ స్వైన్ జ్వరం చెలరేగిన తరువాత ప్రపంచంలోని అతిపెద్ద పంది మాంసం మార్కెట్లో కొరతను తగ్గించడానికి స్థానిక పశువుల స్థాయిలను పునరుద్ధరించడానికి విమానాల రవాణాను ఉపయోగిస్తున్నారు.

యుఎస్ నుండి సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో చైనా మొత్తం 254,533 టన్నుల పంది మాంసాన్ని దిగుమతి చేసుకుంది, ఇది యూరప్‌ను అధిగమించి చైనా యొక్క అతిపెద్ద పంది మాంసం సరఫరాదారుగా అవతరించింది. 2019లో మొత్తానికి చైనా కొనుగోలు చేసింది 245,000 టన్నులు మాత్రమే. అయితే ఈ సంవత్సరం నాలుగు నెలల్లో దానికంటే ఎక్కువగా చైనా మొత్తం 254,533 టన్నుల పంది మాంసాన్ని దిగుమతి చేసుకుంది.

Tags :
|

Advertisement