Advertisement

  • విమాన సిబ్బంది డైపర్లు వాడాల్సిందిగా చైనా ఆదేశం

విమాన సిబ్బంది డైపర్లు వాడాల్సిందిగా చైనా ఆదేశం

By: chandrasekar Fri, 11 Dec 2020 5:41 PM

విమాన సిబ్బంది డైపర్లు వాడాల్సిందిగా చైనా ఆదేశం


ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి రోజు రోజుకి అధికమవుతున్న కారణంగా ఇప్పుడు వివిధ దేశాలు రకరకాల కట్టుబాట్లు నియమిస్తున్నాయి. ఇందులో భాగంగా చైనా కొత్త ఆదేశాలను ప్రకటించింది. ఎక్కువగా వేరే దేశాలనుండి వైరస్ వ్యాప్తి అధికమవుతున్న ఈ సమయంలో విమాన ప్రయాణాలపై ప్రత్యేక నిఘా ఉంచబడింది.

ముందు జాగ్రత్తల్లో చర్యగా కరోనా వైరస్‌ కేసులు ఎక్కువగా ఉన్న దేశాలకు ప్రయాణించే విమాన సిబ్బందులు ప్రస్తుతం విమానాల్లోని టాయ్‌లెట్లను వాడొద్దని దీనికి బదులుగా డైపర్లు వేసుకోవాలని చైనా ఆ దేశ విమాన సిబ్బందులను ఆదేశించింది. ఈ మేరకు సివిల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ చైనా ఆదేశాలు కూడా జారీచేసింది. ప్రతి పది లక్షల జనాభాలో 500కు పైగా వైరస్‌ కేసులు నమోదుచేయబడ్డ దేశాలకు ప్రయాణించే విమానాల్లోని సిబ్బంది ఈ ఆదేశాలు తప్పకుండా పాటించాలని తెలిపింది.

తరచూ వివిధ దేశాలకు సిబ్బంది విమానాల్లో ప్రయాణించడం వల్ల వీరినుండి వైరస్ వ్యాప్తి చెందకుండా విమాన ప్రయాణంలో సిబ్బంది తమ ముఖానికి మెడికల్‌ ప్రొటెక్టివ్‌ మాస్కులు, చేతులకు గ్లౌజులు, కండ్లకు కళ్ళజోడు, టోపీలు మరియు షూ కవర్లు కూడా ధరించాలని సూచించింది. ఇందువల్ల వైరస్ వీరి ద్వారా వ్యాప్తిచెందకుండా ఉంటుందని నిబంధనలను విధించింది.

Tags :
|
|

Advertisement