Advertisement

  • రోడ్డు పేరుతో నేపాల్ ప్రాంతాలు ఆక్రమించిన "చైనా"

రోడ్డు పేరుతో నేపాల్ ప్రాంతాలు ఆక్రమించిన "చైనా"

By: chandrasekar Thu, 25 June 2020 12:27 PM

రోడ్డు పేరుతో నేపాల్ ప్రాంతాలు ఆక్రమించిన "చైనా"


లడఖ్‌లోని భారత పై కన్ను వేసిన చైనా ఇప్పుడు నేపాల్ ను కూడా స్వాధీనం చేసుకోవడం ప్రారంభించింది. నేపాల్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం, ఆ దేశంలో చాలా ప్రాంతాలను చైనా ఇప్పటికే ఆక్రమించింది. ఇది మాత్రమే కాదు, నదుల ప్రవాహాన్ని మార్చి, నేపాల్ కు చెందిన 33 వేల హెక్టార్ల భూమిని చైనా స్వాధీనం చేసుకుంది. భారత్ భూభాగంలోని కాలాపాని విషయంలో అగ్గిగుగ్గిలం అయిన నేపాల్, ఇప్పుడు తన బాస్ చైనా దుర్మార్గపు చర్యపై మౌనంగా ఉండిపోయింది.

ఇదిలా ఉంటే నేపాల్ భూములను చైనా బలవంతంగా ఆక్రమిస్తోందని ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, ఆ దేశ మాజీ ఉప ప్రధాన మంత్రి బిమలిందర్ నిధి ఆరోపించారు. చైనా ఆక్రమించిన రూయి గ్రామంపై చర్యలు తీసుకోవాలని కేపీ ఒలి ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. మరోవైపు టిబెట్‌లో రహదారి నిర్మాణం సాకుతో నేపాల్ భూమిని చైనా ఆక్రమించింది.

నేపాల్ ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ సర్వే విభాగం లెక్కల ప్రకారం దాదాపు 11 ప్రదేశాల గుండా చైనా నిర్మిస్తున్న రహదారి వెళ్లనుంది. దీంతో ఆ ప్రాంతాల్లో చైనా 10 ప్రాంతాలను ఆక్రమించింది. ఇది మాత్రమే కాదు, 33 వేల హెక్టార్ల నేపాల్ భూమిని నదుల ప్రవాహాలను మార్చడం ద్వారా సహజ సరిహద్దుగా మార్చారు. నేపాల్‌లోని రూయి గ్రామాన్ని చైనా స్వాధీనం చేసుకొని తన ఆక్రమణను చట్టబద్ధం చేయడానికి గ్రామ సరిహద్దు స్తంభాలను తొలగించింది.

చైనా ప్రభుత్వం రోడ్డు నెట్‌వర్క్‌ను నిర్మిస్తోంది. అందులో భాగంగా టిబెట్ కు చెందిన పలు నదుల ప్రవాహ మార్గాన్ని మార్చి నేపాల్ వైపు మళ్లించింది. దీంతో నేపాల్‌లో చాలా భాగం చైనా కిందకు వెళుతుంది. సకాలంలో చర్యలు తీసుకోకపోతే నేపాల్ పెద్ద మొత్తంలో భూమిని కోల్పోతుందని నేపాల్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. చైనా తన రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా బాగ్ద్రే ఖోలా నది, కర్నాలి నది మార్గం మార్చేశారు. అంతేకాదు హుమ్లా జిల్లాలో 10 వేల హెక్టార్ల భూమిని ఆక్రమించారు.

china,occupies,nepal,by name,of roads ,రోడ్డు, పేరుతో, నేపాల్ ప్రాంతాలు, ఆక్రమించిన, చైనా


రాసువా జిల్లాలోని సింగెన్, భుర్జుక్, జంబు ఖోలాకు మార్గం మార్చడం వల్ల నేపాల్ యొక్క 6 వేల హెక్టార్ల భూమి ఆక్రమణకు గురైంది. అదే సమయంలో, చైనా ఇప్పటికే 11వేల హెక్టార్ల నేపాల్ భూమిని టిబెట్‌లో ఉందని పేర్కొంది. సింధుపాల్‌చోక్ జిల్లాలో ఖరణి ఖోటే, భోటే కోసి మార్గంలో మార్పుల కారణంగా పలు ప్రాంతాలు ఆక్రమణకు గురి అయ్యాయి.

సంజంగ్, కామ, అరుణ్ నది మార్గం మార్పు కారణంగా టిబెట్‌లో చైనా రహదారి నిర్మాణం సంఖువాస సభ జిల్లాలో 9 వేల హెక్టార్ల భూమిని ఆక్రమించింది. "నదుల ప్రవాహం మార్పు కారణంగా వందల హెక్టార్ల భూమి చైనాలోకి వెళ్ళింది. సాయుధ పోలీసులను నిలబెట్టే ఈ ప్రాంతాల్లో చైనా తన బోర్డర్ అబ్జర్వేషన్ పోస్ట్ (బిఓపి) ను నిర్మించే అవకాశం ఉంది. 1960 లో, సర్వే తరువాత, పలు గ్రామాల్లో స్తంభాలను ఏర్పాటు చేసి చైనా సరిహద్దును నిర్ణయించారు. అయితే అయితే నేపాల్ సరిహద్దును రక్షించే దారి లేకుండా పోయింది.

నేపాల్, చైనా మధ్య 100 స్తంభాలు భారత సరిహద్దులో 8,553 స్తంభాలు ఉన్నాయి. నేపాల్ వార్తాపత్రిక అన్నపూర్ణ పోస్ట్ ప్రకారం, రుయి గ్రామం 2017 సంవత్సరం నుంచి చైనాలో భాగంగా మారింది. ఈ గ్రామంలో ప్రస్తుతం 72 ఇళ్ళు ఉన్నాయి. రూయి గ్రామం నేపాల్ పటంలో ఉన్నప్పటికీ, దీనిపై చైనా నియంత్రణ ఉంది.

ఆక్రమణను చట్టబద్ధం చేయడానికి రూయి గ్రామం యొక్క సరిహద్దు స్తంభాలు తొలగించారు. రూయి గ్రామంలోని 72 ఇళ్లలో నివసిస్తున్న నివాసితులు గుర్తింపు కోసం పోరాడుతున్నారు.

ప్రస్తుత నేపాల్ ప్రభుత్వం చైనాకు లొంగిపోయింది. అందుకే నేపాల్ ప్రభుత్వం ఇప్పుడు చైనా ఆదేశాల మేరకు భారత్ తో వివాదం సృష్టించే పనిలో ఉంది. నేపాల్ ఇటీవలే కొత్త మ్యాప్‌తో బయటకు వచ్చింది, ఇది పిథోరాగడ్ జిల్లాలో భారత భూభాగంలోని కొన్ని భాగాలను పేర్కొంది.

నేపాల్ యొక్క ఈ కొత్త పటాన్ని భారత్ తిరస్కరించింది. దీనికి చారిత్రక వాస్తవాలు లేవని అన్నారు. నేపాల్ కొత్త రాజకీయ పటంలో లిపులేఖ్, కాలాపాణి, లింపియాధూరా ప్రాంతాలు ఉన్నాయి. ఇవి భారత భూభాగంలో ఎప్పటి నుంచో ఉన్నాయి. కాలాపాని, లిపులేఖ్, లింపియాధూరలను చేర్చి నేపాల్ పటాన్ని మార్చడంపై నేపాల్ అధ్యక్షుడు బిద్యా దేవి భండారి గత వారం రాజ్యాంగ సవరణ బిల్లుపై సంతకం చేశారు. ఇదిలా ఉంటే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మే 8 న ఉత్తరాఖండ్‌లోని ధీపుల నుంచి దీపులేఖ్ పాస్‌ను కలిపే 80 కిలోమీటర్ల రహదారిని ప్రారంభించారు. ఈ రహదారి తెరవడంపై నేపాల్ తీవ్రంగా స్పందించింది. ఈ రహదారి నేపాలీ ప్రాంతం గుండా వెళుతుందని పేర్కొంది. రహదారి పూర్తిగా తన భూభాగంలోనే ఉందని పునరుద్ఘాటిస్తూ నేపాల్ వాదనలను భారత్ సమాధానం ఇచ్చింది.

Tags :
|
|

Advertisement