Advertisement

  • న‌రేంద్ర‌మోదీ చేసిన వ్యాఖ్య‌ల‌పై చైనా అభ్యంత‌రం

న‌రేంద్ర‌మోదీ చేసిన వ్యాఖ్య‌ల‌పై చైనా అభ్యంత‌రం

By: chandrasekar Sat, 04 July 2020 10:41 AM

న‌రేంద్ర‌మోదీ చేసిన వ్యాఖ్య‌ల‌పై చైనా అభ్యంత‌రం


ల‌ఢ‌ఖ్ పర్యటనలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ చేసిన వ్యాఖ్య‌ల‌పై చైనా అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. త‌మ‌ను విస్త‌ర‌ణవాదులుగా చిత్రీక‌రించ‌డం క‌రెక్టు కాద‌ని భార‌త్‌లో చైనా రాయ‌బార కార్యాల‌య అధికార ప్ర‌తినిధి జీ రోంగ్ పేర్కొన్నారు.

త‌మ‌ది విస్త‌ర‌ణవాదం కాద‌ని, త‌మ‌తో స‌రిహ‌ద్దు క‌లిగిన 14 దేశాలలో 12 దేశాల‌తో చ‌ర్చ‌ల ద్వారా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకున్నామ‌ని తెలిపారు. చాలా దేశాల‌తో స్నేహ సంబంధాల ద్వారా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకున్నామ‌ని, త‌మ‌ది విస్త‌ర‌ణవాదంగా చీత్రిక‌రించ‌డం త‌గ‌ద‌ని రోంగ్ ట్వీట్ చేశారు. గ‌ల్వాన్ ఘ‌ర్ష‌ణ‌ల నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ఈ ఉద‌యం ల‌ఢ‌ఖ్‌లో ప‌ర్య‌టించారు.

ఈ సంద‌ర్భంగా సైనికులను ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాని విస్త‌ర‌ణ‌వాదం కాలం చెల్లింద‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం అభివృద్ధివాదం కాలం న‌డుస్తున్న‌ద‌ని పేర్కొన్నారు. గ‌ల్వాన్‌లో చైనా దురాక్ర‌మ‌ణ‌కు ప్ర‌య‌త్నించ‌డాన్ని ఉద్దేశించి ప్ర‌ధాని ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని వ్యాఖ్య‌ల‌పై చైనా అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది.

Tags :
|

Advertisement