Advertisement

కృత్రిమ సూర్యుడిని తయారు చేసిన చైనా...

By: chandrasekar Wed, 09 Dec 2020 3:15 PM

కృత్రిమ సూర్యుడిని తయారు చేసిన చైనా...


కృత్రిమ సూర్యుడిని చైనా తాయారు చేసి౦ది. చైనా ఈ విషయాన్ని కొన్ని నెలల కిందట చెబితే కేవలం మాటలే అనుకున్నారు. కానీ, దాన్ని నిజం చేసింది. ఇప్పుడు ఇతర దేశాలు కూడా కృత్రిమ సూర్యుడిని రూపొందించే పనిలో నిమగ్నమైయ్యాయట. అయితే ఇది ఆకాశంలో కనిపించే సూర్యుడు కాదు నేలపై నిప్పులు కురిపించి సూర్యుడి కంటే రెట్టింపు శక్తిని అందించే రియాక్టర్లు. ఈ కృత్రిమ సూర్యుడి గురించి తప్పకుండా తెలుసుకోవాలి. చైనా ప్రభుత్వం దేశీయ టెక్నాలజీతో ఈ ‘కృత్రిమ సూర్యుడు’ రూపొందించామని వెల్లడించింది. దీన్ని ‘హెచ్‌ఎల్‌-2ఎమ్‌ టోకామాక్ రియాక్టర్’గా పిలుస్తున్నారు. అతి పెద్ద, అడ్వాన్స్డ్ న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రయోగం కోసం ఈ కృత్రిమ సూర్యుడిని రూపొందించినట్లు తెలిపింది చైనా. సూర్యుడి పరమాణు కేంద్రంలో అత్యధిక శక్తి ఉంటుంది. అందులోని అణువులు విచ్చిన్నమైనప్పుడు భారీ శక్తి ఉత్పత్తి అవుతుంది. ఈ రియాక్టర్‌ కూడా అదే విధంగా పనిచేస్తుంది. పైగా సూర్యుడు విడుదల చేసి శక్తి కంటే పది రెట్లు ఎక్కువ శక్తిని విడుదల చేస్తుంది. సిచువాన్‌లో ఈ రియాక్టర్‌ను ఏర్పాటు చేశారు.

దీనిలో శక్తిమంతమైన అయస్కాంత క్షేత్రంలో మెటల్ ప్లాస్మాను విచ్ఛిన్నం చేస్తారు. ఈ సందర్భంగా 15 కోట్ల డిగ్రీల సెల్సియస్ శక్తి విడుదల అవుతుంది. చాలామందిలో కృత్రిమ సూర్యుడు అంటే ఆకాశంలో ఉండి వెలుగునిస్తుందా అనే సందేహం వస్తోంది. కానీ, అది వాస్తవం కాదు. ఇది కేవలం విద్యుత్ తదితర అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న రియాక్టర్. దీని ద్వారా ఏర్పడే అణుశక్తిని చైనా విద్యుత్తు అవసరాల కోసం ఉపయోగిస్తుందని అంటున్నారు. కానీ, దీన్ని అణ్వాయుధాలకు సైతం వాడుకొనే ప్రమాదం ఉందని సమాచారం. అదే జరిగితే ఇండియా, అమెరికాలకు ఆపద కాచుకుని ఉన్నట్లే. ఫ్రాన్స్ కూడా న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్‌ను తయారు చేస్తున్నారట.

Tags :
|
|
|

Advertisement