Advertisement

చైనా దుందుడుకు వైఖరి మాత్ర౦ మానడం లేదు

By: chandrasekar Wed, 09 Sept 2020 1:23 PM

చైనా దుందుడుకు వైఖరి మాత్ర౦ మానడం లేదు


సరిహద్దు ఘర్షణపై భారత్, చైనాలు ఓ వైపు చర్చలు జరుపుతుండగా చైనా దురాలోచన మాత్ర౦ మారడం లేదు. భారత జవాన్లపై కాల్పులకు దిగడంతో భారత్ ఎదురుదాడికి దిగింది. భారత చైనా సరిహద్దు వివాదం, ఘర్షణ నేపధ్యంలో రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయినా సరే చైనా దురాలోచన మానడం లేదు. చైనా సైన్యం సోమవారం రాత్రి, మంగళవారం వరుసగా రెజాంగ్ లా హైట్స్ వద్ద భారత ఆర్మీతో తలపడింది.

పర్వత ప్రాంతంపై ఉన్న ఇండియన్ ఆర్మీను తరిమికొట్టే ఆలోచనతో చైనా సైనికులు ఒప్పందానికి తిలోదకాలు వదిలారు. నియంత్రణ రేఖ వెంబడి భారత స్థావరాలపై కాల్పులు జరిపారు. దీనికి ప్రతిగా భారత ఆర్మీ ఎదురుకాల్పులు జరిపింది. రెండువైపులా కాసేపు కాల్పుల అనంతరం పరిస్థితి అదుపులో వచ్చినట్టు తెలుస్తోంది. రెజాంగ్ లా హైట్స్ ప్రాంతంలో రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణ చెలరేగినా సరే ఇరు దేశాల సైనికుల మధ్య సంప్రదింపులు కొనసాగుతున్నాయి. చైనా వైఖరి నేపధ్యంలో ప్రధాని మోదీ నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరగబోతోంది.

Tags :
|
|
|

Advertisement