Advertisement

  • మరొకసారి తన దుర్బుద్ది బయటపెట్టుకున్న చైనా ..కరోనా గురించి చెప్పింది అని జర్నలిస్ట్ కు జైలు శిక్ష

మరొకసారి తన దుర్బుద్ది బయటపెట్టుకున్న చైనా ..కరోనా గురించి చెప్పింది అని జర్నలిస్ట్ కు జైలు శిక్ష

By: Sankar Mon, 28 Dec 2020 10:41 PM

మరొకసారి తన దుర్బుద్ది బయటపెట్టుకున్న చైనా ..కరోనా గురించి చెప్పింది అని జర్నలిస్ట్ కు జైలు శిక్ష


కరోనా వైరస్ పుట్టుక గురించి ప్రపంచ వ్యాప్తంగా చైనా మీద అనేక ఆరోపణలు వచ్చాయి..అయితే తాజాగా చైనా ప్రభుత్వం కరోనా మహమ్మారి గురించి బయటకు చెప్పిన సిటిజన్‌ జర్నలిస్ట్‌కు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. చైనాలో కరోనా వైరస్‌ ప్రబలినప్పుడు ఊహన్‌లోని ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసిపోయాయి.

ఈ విషయాన్ని 37 ఏళ్ల జాంగ్‌జాన్‌ బట్టబయలు చేసింది. వూహాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ఫొటోలతో పాటు స్థానికుల ఇంటర్వ్యూలను యూట్యూబ్‌లో పోస్టు చేసింది. దీనిపై కన్నెర్ర చేసిన చైనా ప్రభుత్వం... ఆమెపై తప్పుడు కేసులు బనాయించింది. జనంతో వాదనకు దిగుతూ... సమస్యలు సృష్టిస్తోందనే ఆరోపణలతో ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్ష వేసింది అక్కడి కోర్టు.

మరోకరు జాంగ్‌జాన్‌ల ప్రవర్తించకూడదనే హెచ్చరికలో భాగంగానే ఆమెకు నాలుగేళ్ల శిక్ష విధించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, జాంగ్‌జాన్‌ అరెస్ట్‌తోనే ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి... ఆమెకు 4 ఏళ్ల జైలు శిక్ష విధించడాన్నిపలువురు ఖండిస్తున్నారు.

Tags :
|
|

Advertisement