Advertisement

  • అక్కడ సినిమా థియేటర్లు ఓపెన్ చేయడానికి అనుమతి ..

అక్కడ సినిమా థియేటర్లు ఓపెన్ చేయడానికి అనుమతి ..

By: Sankar Thu, 16 July 2020 7:45 PM

అక్కడ సినిమా థియేటర్లు ఓపెన్ చేయడానికి అనుమతి ..



కరోనా కారణంగా ప్రపంచం మొత్తం అన్ని మూతపడ్డాయి..ముఖ్యంగా సినిమా రంగానికి బాగా దెబ్బ పడింది ..ఎక్కడికక్కడ సినిమా షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి ..వాటితోపాటు థియేటర్లు కూడా మూతపడ్డాయి ..దాదాపు నాలుగు అయిదు నెలలు అవుతున్న కూడా థియేటర్లు ఓపెన్ అవ్వడం లేదు ..అయితే కరోనా తీవ్రత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో సినిమా హాళ్లను తెరిచేందుకు చైనా ప్రభుత్వం నిర్ణయించింది.

జులై 20 నుంచి కార్యకలాపాలను ప్రారంభించేందుకు అనుమతించింది. అయితే కరోనా భయం పూర్తిగా తొలగిపోని కారణంగా ప్రేక్షకుల క్షేమం కోసం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. ముఖ్యంగా.. సినిమా హాళ్ల పూర్తి సామర్థ్యంలో కేవలం 30 శాతం మందిని మాత్రమే హాల్‌లోకి అనుమతించేందుకు నిర్ణయించింది.

అంతేకాకుండా.. ప్రేక్షకుల మధ్య కొన్ని సీట్లు ఖాళీగా ఉంచాలని కూడా యాజమాన్యాలకు సూచించింది. ఇక సినిమా చూడాలనుకునే వారు ముందుగానే ఆన్‌లైన్‌లో టిక్కెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా ప్రేక్షకులందరూ తప్పనిసరిగా మాస్కు ధరించాల్సి ఉంటుంది. కరోనా దెబ్బకు అల్లాడుతున్న సినిమా రంగాన్ని ఆదుకునేందుకే చైనా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Tags :
|
|
|

Advertisement