Advertisement

  • రిసెర్చ్ సెంటర్స్‌పై చైనా సైబర్ దాడులు‌...అమెరికా న్యాయ‌శాఖ స్పష్టం

రిసెర్చ్ సెంటర్స్‌పై చైనా సైబర్ దాడులు‌...అమెరికా న్యాయ‌శాఖ స్పష్టం

By: chandrasekar Thu, 23 July 2020 1:52 PM

రిసెర్చ్ సెంటర్స్‌పై చైనా సైబర్ దాడులు‌...అమెరికా న్యాయ‌శాఖ స్పష్టం


కరోనావైరస్ వ్యాక్సిన్ త‌యారు చేస్తోన్న బయోటెక్ సంస్థలపై హ్యాకింగ్ చేయడం ద్వారా చైనా హ్యాకర్స్ సైబ‌ర్ దాడులకు పాల్పడుతున్నారని అమెరికా ఆరోపించింది. క‌రోనావైర‌స్ వ్యాప్తికి కారణమైన చైనా తాజాగా మరో కుట్రకు తెరతీసిందని అమెరికా ఆరోపిస్తోంది.

చైనాకు చెందిన ఈ హ్యాకర్స్‌కి చైనా ఇంటెలీజెన్స్ ఏజెంట్స్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్టు అమెరికా గుర్తించింది. అమెరికాతో పాటు ఇత‌ర దేశాల్లోనూ కరోనా టీకాపై ప‌రిశోధనలు చేస్తోన్న రిసెర్చ్ సెంటర్స్‌పై చైనా సైబర్ దాడుల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు అమెరికా న్యాయ‌శాఖ స్పష్టంచేసింది.

ఈ కేసులో చైనాకు చెందిన లీ జియావూ, డాంగ్ జియాజి అనే ఇద్దరు హ్యాకర్స్‌పై కేసు న‌మోదైంది. ఈ మేరకు అమెరికా నేర పరిశోధన సంస్థ ఎఫ్‌బీఐ ( FBI ) ఆ ఇద్దరి ఫోటోలను విడుదల చేయగా అమెరికా అసిస్టెంట్ అటార్నీ జ‌న‌ర‌ల్ జాన్ డీమ‌ర్స్ చైనీస్ హ్యాకర్స్ చేస్తోన్న సైబర్ దాడులపై పలు విషయాలు వెల్లడించారు.

అమెరికాలోని మ‌సాచుసెట్స్ బ‌యోటెక్ సంస్థ‌పై లీ జియావూ, డాంగ్ జియాజి జ‌న‌వ‌రిలోనే సైబ‌ర్ దాడికి పాల్పడిన‌ట్లు అమెరికా ఆరోపిస్తోంది. అమెరికాలో కొవిడ్‌-౧౯కరోనా టీకాపై ప‌రిశోధ‌న‌లు చేపడుతున్న సంస్థలో ఒకటైన మసాచుసెట్స్ బయోటెక్ సంస్థను లక్ష్యంగా చేసుకుని చైనీస్ హ్యాకర్స్ హ్యాకింగ్‌కి పాల్పడ్డారని అలాగే మేరీల్యాండ్ కంపెనీకి చెందిన డేటాను సైతం హ్యాకింగ్ చేశారనేది ఎఫ్‌బీఐ చేస్తోన్న ఆరోపణ.

Tags :
|
|

Advertisement