Advertisement

  • చైనా కరోనా వాక్సిన్ ‘కరోనావాక్‌’ వికటించడంతో వాలంటీర్ మృతి... క్లినికల్ ట్రయల్స్‌ తాత్కాలికంగా నిలిపివేత...

చైనా కరోనా వాక్సిన్ ‘కరోనావాక్‌’ వికటించడంతో వాలంటీర్ మృతి... క్లినికల్ ట్రయల్స్‌ తాత్కాలికంగా నిలిపివేత...

By: chandrasekar Wed, 11 Nov 2020 10:00 AM

చైనా కరోనా వాక్సిన్ ‘కరోనావాక్‌’ వికటించడంతో వాలంటీర్ మృతి...  క్లినికల్ ట్రయల్స్‌ తాత్కాలికంగా నిలిపివేత...


కరోనా వైరస్ పుట్టినిల్లు చైనా తాయారు చేసిన కరోనా వాక్సిన్ ‘కరోనావాక్‌’ వికటించడంతో వాలంటీర్ మృతి చెందారు. ప్రపంచానికి కరోనా వైరస్‌ను అంటించి అభాసుపాలైన చైనాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. చివరి దశలో ఉన్న చైనా వ్యాక్సిన్ ప్రయోగాలు వికటించాయి. తీవ్ర విపరిణామాలకు దారి తీయడంతో క్లినికల్ ట్రయల్స్‌ను అర్ధంతరంగా నిలిపివేశారు. టీకా తీసుకున్న వాలంటీర్లు మరణించినట్లు కొన్ని అంతర్జాతీయ పత్రికలు రాశాయి. కొన్ని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తిన్నట్లు తెలిపాయి. కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ రేసులో అంతర్జాతీయంగా ముందున్న చైనాకు ఇది గట్టి ఎదురుదెబ్బే. అంతేకాదు లక్షలాది మంది చైనా ప్రజలకు ఈ వ్యాక్సిన్‌ పంపిణీ ఇప్పటికే ప్రారంభం కావటంతో పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. చైనా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ ‘కరోనావాక్‌’ ప్రయోగాలు బ్రెజిల్‌లో జరుగుతున్నాయి. కానీ ఈ ప్రయోగాల్లో టీకా తీసుకున్న రోగుల్లో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. విపరిణామాలకు దారితీయటంతో నిబంధనలను అనుసరించి క్లినికల్ ట్రయల్స్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు బ్రెజిల్‌ ఆరోగ్య శాఖ మంగళవారం, నవంబర్ 10 న ఒక ప్రకటనలో తెలిపింది.

కరోనాను కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలు తయారు చేసిన వాక్సిన్ లు వివిధ దశల్లో క్లినికల్ ట్రయల్స్ లో వున్నాయి. అలాగే చైనా తయారు చేసిన కరోనావాక్ టీకా తీసుకున్న కొందరిలో మరణాలు సంభవించగా ఇతర దుష్ప్రభావాలు మరణానికి దారితీసేవిగాను, దీర్ఘకాలం ప్రభావం చూపేవిగాను, తీవ్ర అనారోగ్యానికి దారి తీసేవిగా ఉన్నాయని మీడియా కథనాల్లో పేర్కొన్నారు. ఈ సంఘటన అక్టోబర్‌ 29నే చోటుచేసుకోగా బయటి ప్రపంచానికి చాలా ఆలస్యంగా తెలిసింది. కానీ ప్రయోగాలను నిర్వహిస్తున్న సినోవాక్‌ బయోటెక్‌ లిమిటెడ్‌ ఫార్మా సంస్థ ఈ విషయంపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. చైనా వ్యాక్సిన్ ప్రయోగాల్లో వాలంటీర్లకు ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లు ఇంతకుముందే వార్తలు వచ్చాయి. అయితే అవి ట్రయల్స్‌ను నిలిపివేసేంత తీవ్రమైనవి కావని సినోవాక్‌ బయోటెక్‌ లిమిటెడ్‌ పేర్కొంది. భారీ స్థాయిలో జరిగే ఔషధ ప్రయోగాల్లో ఇలాంటి ఆటంకాలు సాధారణమేనని సమర్థించుకుంది. కానీ ఇప్పుడు దీని క్లినికల్ ట్రయల్స్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు తెలిసింది.

Tags :
|

Advertisement