Advertisement

  • 2000 కిలోమీటర్ల మేర ముళ్ల కంచెతో గోడ కట్టనున్న చైనా

2000 కిలోమీటర్ల మేర ముళ్ల కంచెతో గోడ కట్టనున్న చైనా

By: Sankar Fri, 18 Dec 2020 4:24 PM

2000 కిలోమీటర్ల మేర ముళ్ల  కంచెతో గోడ కట్టనున్న చైనా


చైనా మరొకసారి తన పక్కదేశంతో కయ్యానికి కాలు దువ్వుతుంది..అయితే ఈ సారి కయ్యం ఇండియాతో కాదు మయన్మార్ తో.. మ‌య‌న్మార్ నుంచి త‌మ దేశంలోకి చొర‌బాట్ల‌ను అరిక‌ట్టేందుకు చైనా 2000 కి.మీ. మేర ముళ్ల కంచెను ఏర్పాటు చేస్తోంది. అయితే ఈ గోడ‌ను మ‌య‌న్మార్ ఆర్మీ వ్య‌తిరేకిస్తున్నా లెక్క చేయ‌కుండా చైనా త‌న ప్ర‌ణాళిక ప్రకారం ముందుకు వెళ్తోంది.

ఈ గోడ‌పై అమెరికా కూడా ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. రానున్న రోజుల్లో ఇది ద‌క్షిణాసియా ప్రాంతంలో మ‌రిన్ని వివాదాల‌కు దారి తీసే ప్ర‌మాదం ఉన్న‌ద‌ని హెచ్చ‌రించింది. అయితే చైనా మాత్రం ఈ గోడ‌ను స‌మ‌ర్థించుకుంటోంది.మ‌య‌న్మార్ నుంచి అక్ర‌మ చొర‌బాట్ల‌ను అరి క‌ట్ట‌డానికే దీనిని నిర్మిస్తున్న‌ట్లు అక్క‌డి అధికార ప‌త్రిక గ్లోబ‌ల్ టైమ్స్ చెబుతోంది.

చైనాలోని నైరుతి ప్రాంతంలోని యునాన్ ప్రావిన్స్‌లో 9 మీట‌ర్ల ఎత్తుతో ఈ గోడ‌ను నిర్మిస్తున్న‌ట్లు ఆ ప‌త్రిక తెలిపింది. ఈ గోడ‌ను ఎప్ప‌టి నుంచో వ్య‌తిరేకిస్తున్న మ‌య‌న్మార్ ఆర్మీ.. త‌మ నిర‌స‌న తెలుపుతూ ఓ లేఖ‌ను కూడా రాసింది

Tags :
|
|

Advertisement