Advertisement

  • శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

By: chandrasekar Thu, 24 Sept 2020 10:03 AM

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి


తిరుమలలోని శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పంచెకట్టు, తిరునామంతో మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఊరేగింపుగా వెళ్లి శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వేదపండితులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ఆశీర్వచనాలు అందించారు.

అనంతరం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి‌, డిప్యూటీ సీఎంలు ఆళ్ల నాని, నారాయణ స్వామి, ధర్మాన కృష్ణ దాస్, మంత్రులు పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, మేకతోటి సుచరిత, కొడాలి నాని, మేకపాటి గౌతమ్ రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, చింతల రామ చంద్రారెడ్డి, బియ్యపు మధు సూధన్ రెడ్డి, కొలుసు పార్థ సారధి, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్.కె.రోజా శ్రీవారి గరుడ వాహన సేవలో పాల్గొన్నారు.

అంతకుమునుపు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బేడి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం క్యాలెండర్‌ను, డైరీని జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. శ్రీవారి దర్శనం అనంతరం శ్రీ పద్మావతి అతిధి గృహానికి చేరుకున్నారు. రాత్రికి ఆయన అక్కడే బస చేసి గురువారం ఉదయం 6.15 గంటలకు పద్మావతి అతిధి గృహం నుండి బయలుదేరి కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్పతో కలిసి శ్రీవారిని దర్శించుకుంటారు.

జగన్‌మోహన్‌రెడ్డి మరియు యడ్యూరప్ప ఇరు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు నాద నీరాజనం సుందర కాండ పారాయణ కార్య క్రమంలో పాల్గొంటారు. అలాగే కర్ణాటక రాష్ట్ర ఛారిటీస్ సత్రాలకు శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తిరుమల నుండి 9.20 గంటలకు బయలుదేరి 10.20 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని గన్నవరం తిరుగు ప్రయాణం అవుతారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ముఖ్యమంత్రి పాల్గొని శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితి. ఈసారి జగన్ మోహన్ రెడ్డి పాల్గొని వస్త్రాలు సమర్పించారు.


Tags :
|

Advertisement