Advertisement

  • తెలంగాణ ప్రజలకు బ‌తుక‌మ్మ పండుగ శుభాకాంక్ష‌లు తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్

తెలంగాణ ప్రజలకు బ‌తుక‌మ్మ పండుగ శుభాకాంక్ష‌లు తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్

By: chandrasekar Sat, 17 Oct 2020 09:50 AM

తెలంగాణ ప్రజలకు బ‌తుక‌మ్మ పండుగ శుభాకాంక్ష‌లు తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్


ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకొనే బతుకమ్మ పండుగకు గాను ముఖ్యమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ బ‌తుక‌మ్మ పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు. తెలంగాణ ఆత్మ‌గౌర‌వ ప్ర‌తీక‌గా, తెలంగాణ సాంస్కృతిక వైభ‌వానికి చిహ్నంగా నిలుస్తున్న బ‌తుక‌మ్మ పండుగ‌ను ప్ర‌జ‌లు భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకోవాల‌ని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుకంగా జీవించాలని వేడుకొన్నారు. రాష్ట్రంలో పంట‌లు బాగా పండి వ్య‌వ‌సాయం గొప్ప‌గా వ‌ర్ధిల్లాలి అని ఆకాంక్షించారు. ప్ర‌తీ ఇంట్లోకి సుఖ సంతోషాలు వెల్లివిరిసేలా దీవించాల‌ని అమ్మ‌వారిని సీఎం కేసీఆర్ ప్రార్థించారు. క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూ బ‌తుక‌మ్మ ఉత్స‌వాలు జ‌రుపుకోవాల‌ని ప్ర‌జ‌ల‌కు సీఎం విజ్ఞ‌ప్తి చేశారు.

Tags :
|

Advertisement