Advertisement

  • గవర్నర్ తమిళిసై ను కలిసిన ముఖ్యమంత్రి కెసిఆర్

గవర్నర్ తమిళిసై ను కలిసిన ముఖ్యమంత్రి కెసిఆర్

By: chandrasekar Sat, 03 Oct 2020 6:39 PM

గవర్నర్ తమిళిసై ను కలిసిన ముఖ్యమంత్రి కెసిఆర్


గవర్నర్ తమిళిసై ను కలవడంతో బాటు ఆమె భర్త డాక్టర్ సౌందర్‌రాజన్‌ను ముఖ్యమంత్రి కెసిఆర్ గౌరవించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుక్రవారం గవర్నర్‌ తమిళిసైసౌందర్‌రాజన్‌ను కలిశారు. లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్‌లో మహాత్మాగాంధీకి నివాళులర్పించిన అనంతరం సీఎం కేసీఆర్‌ నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. నెఫ్రాలజీ విభాగంలో ద్రోణాచార్య అవార్డుకు ఎంపికైన గవర్నర్‌ భర్త, ప్రముఖ నెఫ్రాలజిస్ట్‌ డాక్టర్‌ పీ సౌందర్‌రాజన్‌ను ముఖ్యమంత్రి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

గవర్నర్ భర్త డాక్టర్ 35 ఏండ్లపాటు నెఫ్రాలజీ వైద్యుడిగా సేవలందించి ఎంతోమంది ప్రాణాలు కాపాడారని కొనియాడారు. సౌందర్‌రాజన్‌ విజయాల పట్ల మొత్తం తెలంగాణ గర్వపడుతున్నదని పేర్కొన్నారు. అనంతరం రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలపై గవర్నర్‌తో సీఎం కేసీఆర్‌ చర్చించారు. ధరణి పోర్టల్‌, కొత్త రెవెన్యూ విధానం ప్రారంభం, వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియను గవర్నర్‌కు వివరించినట్టు సమాచారం.

ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పరిస్థితులు సహా తాజా పరిణామాలు, ఇతర అంశాలు చర్చకు వచ్చినట్టు తెలిసింది. రాజ్‌భవన్‌లో శుక్రవారంనుంచి ప్రారంభమైన ఈ- ఆఫీస్‌ విధానం గురించి సీఎం కేసీఆర్‌కు వివరించిన గవర్నర్‌ రాజ్‌భవన్‌కు స్వయంగా వచ్చి సౌందర్‌రాజన్‌ను ప్రశంసించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ- ఆఫీస్‌ ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

Tags :
|
|

Advertisement