Advertisement

  • వరద బాధితుల ఆర్థిక సాయానికి మార్గదర్శకాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్

వరద బాధితుల ఆర్థిక సాయానికి మార్గదర్శకాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్

By: chandrasekar Tue, 20 Oct 2020 09:33 AM

వరద బాధితుల ఆర్థిక సాయానికి మార్గదర్శకాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్


ఆంధ్ర రాష్ట్రాల్లో భారీగా కురిసిన వరద బాధితుల ఆర్థిక సాయానికి మార్గదర్శకాలను ముఖ్యమంత్రి కెసిఆర్ విడుదల చేశారు. హైదరాబాద్‌లో వరద ప్రభావానికి గురైన ప్రజలను ఆదుకొనేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించిన ఆర్థిక సాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదలచేసింది. నగదు పంపిణీని తక్షణం ప్రారంభించాలని, ఈ ప్రక్రియను వారం రోజుల్లో పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు సూచించింది. ఆర్థిక సాయం ఒకే విడుతలో అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రభావితమైన ప్రతి ఒక్క కుటుంబానికి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టంచేసింది. ఈ మార్గదర్శకాలు తప్పకుండా పాటించాలని పేర్కొంది. ప్రజలు ఇబ్బందులు పడకుండా ఈ సహాయ చర్యలు చేపట్టారు.

మార్గదర్శకాల లో భాగంగా వివిధ ప్రాంతాల్లో స్పెషల్‌ ఆఫీసర్‌, జీహెచ్‌ఎంసీ అధికారి, రెవెన్యూ లేదా ఇతర శాఖ అధికారితో కూడిన త్రి సభ్య బృందాలను ఏర్పాటుచేయాలి. వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి ఇంటిని లెక్కలోకి తీసుకోవాలి. మురికివాడలు, ఇతర ప్రాంతాల్లో ఉన్న అన్ని ఇండ్లను పరిగణలోకి తీసుకోవాలి. ముంపు వల్ల నష్టపోయిన ఇండ్లతో పాటు, గృహాలు, వస్తువులకు జరిగిన నష్టాన్ని లెక్కించాలి. పేదలు, మురికివాడల్లోని ప్రజలు, వల్నరబుల్‌ గ్రూప్‌నకు చెందినవారి ఇండ్లను లెక్కించేటపుడు ఎవరూ నష్టపోకుండా చూసుకోవాలి. ప్రభావిత కుటుంబాల వద్దకు వెళ్లి ఆర్థిక సాయాన్ని అందించాలి. కుటుంబసభ్యుల వివరాలు, జియో కోఆర్డినేట్స్‌తో కూడిన యాప్‌ ద్వారా ఈ ప్రక్రియ పూర్తి చేయాలి.

ఇక్కడ మొబైల్‌ యాప్‌ ద్వారా ఆధార్‌ నంబర్‌ సాయంతో ప్రభావిత కుటుంబాల ఇతర వివరాలు నిక్షిప్తం చేస్తారు. ఈ పంపిణీ సమయంలో ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు. దీనివల్ల ఎలాంటి అవకతవకలు జరగకుండా, ఒక కుటుంబానికి ఒకేసారి సాయం అందించడం సాధ్యమవుతుంది. సాయం పొందిన కుటుంబంలో ఇంటి పెద్దకు ముగ్గురు అధికారులు సంతకాలు చేసిన అక్నాలెడ్జమెంట్‌ పత్రాన్ని అందిస్తారు. జీహెచ్‌ఎంసీ చుట్టూ ఉన్న ఇతర పట్టణ స్థానిక సంస్థల్లో జిల్లా కలెక్టర్‌, స్థానిక మున్సిపల్‌ కమిషనర్‌ ముగ్గురు అధికారులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేస్తారు. రిలీఫ్‌ టీంను లీడ్‌ చేసే స్పెషల్‌ ఆఫీసర్‌ పంపిణీని మార్గదర్శకాలకు అనుగుణంగా సజావుగా సాగేలా చూస్తారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటారు. ఇందువల్ల బాధితులకి త్వరగా ఆర్ధిక సాయం అందుతుంది.

Tags :
|

Advertisement