Advertisement

  • తెలుగు సినీ పరిశ్రమకు భారీ రాయితీలు ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

తెలుగు సినీ పరిశ్రమకు భారీ రాయితీలు ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

By: chandrasekar Sat, 19 Dec 2020 11:23 AM

తెలుగు సినీ పరిశ్రమకు భారీ రాయితీలు ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి


కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన కారణంగా భారీ నష్టాలను చవిచూసిన తెలుగు సినీ పరిశ్రమకు జగన్ ప్రభుత్వం భారీ రాయితీలను ప్రకటించింది. ఇందుకోసం పలువురు సినీ ప్రముఖుల తో బాటు చిరంజీవి మరియు నాగార్జున ముఖ్యమంత్రి జగన్ కు కృత‌జ్ఙతలు తెలిపారు. గత జూన్ నెలలో నటులు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున అలాగే దర్శకుడు రాజమౌళి, నిర్మాతలు సురేశ్‌బాబు తదిరులు సీఎంను కలిసి సినీ పరిశ్రమ చవి చూసిన నష్టాలపై ముఖ్యమంత్రి జగన్ కు వినతి పత్రం సమర్పించారు.

ఇందుకోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సినీ పరిశ్రమకు ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుని భారీగా రాయితీలు ప్రకటించింది. ఇందుకుగాను 3 నెలల పాటు థియేటర్లు చెల్లించాల్సిన ఫిక్స్‌డ్‌ ఎలక్ట్రిసిటీ చార్జీలు రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఏప్రిల్, మే, జూన్ మాసాలకు వర్తించనుంది. ఈ క్రమంలో నెలకు రూ. 3 కోట్ల చొప్పున ప్రభుత్వం భరించనుందని రాష్ట్ర కేబినెట్ తెలిపింది.

థియేటర్ల లాక్ డౌన్ కారణంగా తరువాత 6 నెలల ఫిక్స్‌డ్ విద్యుత్ చార్జీలను ప్రస్తుతం చెల్లించాల్సిన అవసరం లేకుండా వాయిదా వేశారు. దీంతో బాటు రీస్టార్ట్ ప్యాకేజీ కింద సినిమా థియేటర్లకు వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణాలు మరియు ఏ, బీ సెంటర్లలో రూ.10 లక్షల చొప్పున అలాగే సి సెంటర్లలో ఉన్న థియేటర్లకు రూ. 5 లక్షల చొప్పున రుణాలు ఇవ్వనున్నట్లు రాష్ట్ర కేబినెట్ తెలిపింది. ఈ రుణాల చెల్లింపుపై 6 నెలల మారటోరియంను ఆ తర్వాత ఏడాది నుంచి 4.50 శాతం వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనుంది. దీనిపై చిత్ర పరిశ్రమలో చాలామంది జగన్ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.

Tags :
|

Advertisement