Advertisement

  • ఛెత్రీ త‌ర్వాత త‌రం గురించి ఆందోళ‌న‌గా ఉంది; బైచుంగ్ భూటియా

ఛెత్రీ త‌ర్వాత త‌రం గురించి ఆందోళ‌న‌గా ఉంది; బైచుంగ్ భూటియా

By: chandrasekar Tue, 21 July 2020 12:00 PM

ఛెత్రీ త‌ర్వాత త‌రం గురించి ఆందోళ‌న‌గా ఉంది; బైచుంగ్ భూటియా


భార‌త మాజీకెప్టెన్ బైచుంగ్ భూటియా భార‌త ఫుట్‌బాల్ జ‌ట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రీ అద్భుత‌మైన స్ట్ర‌యిక‌ర్ అని అయితే అత‌డి త‌ర్వాత ఆ స్థాయి ఆట‌గాడు జ‌ట్టులో క‌నిపించ‌డం లేద‌ని అన్నాడు. భార‌త ఫుట్‌బాల్ చ‌రిత్ర‌లో ఐఎమ్ విజ‌య‌న్‌, బైచుంగ్ భూటియా, సునీల్ ఛెత్రీ గొప్ప ఆట‌గాళ్లుగా గుర్తింపు సాధించారు.

భూటియా రిటైర్మెంట్‌కు ముందే జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్న ఛెత్రీ ఇప్పుడు స్టార్‌గా ఎదిగాడు. అదే విధంగా అత‌డి త‌ర్వాత త‌రం గురించి ఆందోళ‌న‌గా ఉంద‌ని భూటియా అభిప్రాయ‌ప‌డ్డాడు. జేజే లాల్‌పెకువా, బ‌ల్వంత్ సింగ్ వంటి ఆట‌గాళ్ల‌లో ఆ స‌త్తా ఉందా అనేది అనుమాన‌మే అని అన్నాడు.

భూటియా సోమ‌వారం మాట్లాడుతూ `ఛెత్రీ త‌ర్వాత ఎవ‌ర‌నే ప్ర‌శ్న ఉత్పన్న‌మైతే అందుకు స‌మాధానం ల‌భించ‌డం క‌ష్ట‌మే. ఎందుకంటే ప్ర‌స్తుత జ‌ట్టులో అలాంటి ఆట‌గాళ్లు లేరు. సునీల్ స్థాయి స్ట్రయిక‌ర్ జ‌ట్టులో మ‌రొక‌రు లేరు. ఆట‌గాడు ఎద‌గాలంటే అత‌డికి ప్ర‌ధానంగా నిల‌క‌డ ఉండాలి. జేజేకు గాయాల బెడ‌ద ఎక్కువ‌. బ‌ల్వంత్ ప‌రిస్థితి కూడా అదే. వాళ్లు గాయాల‌తో సావాసం చేయాల్సిన ప‌రిస్థితి` అని తెలిపారు.

Tags :

Advertisement