Advertisement

కరోనా తో ఛ‌త్తీస్‌గ‌ఢ్ మాజీ మంత్రి మృతి

By: Sankar Mon, 14 Sept 2020 3:40 PM

కరోనా తో ఛ‌త్తీస్‌గ‌ఢ్ మాజీ మంత్రి మృతి


కరోనా మహమ్మారికి పేద ధనిక , రాజకీయ నాయకులూ , సాధారణ ప్రజలు అనే తేడా లేకుండా అందరు కరోనా భారిన పడుతున్నారు..అయితే తాజాగా చత్తీస్ఘడ్ మాజీ మంత్రి కరోనా కారణంగా మృతి చెందాడు..

క‌రోనా వైర‌స్ భారిన ప‌డిన మాజీ మంత్రి చనేష్ రామ్ రతియా రాయ్‌గ‌ర్‌లోని ఆస్ప్ర‌తిలో చికిత్స పొందుతూ ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఈ ఉద‌యం మృతిచెందారని వైద్యాధికారులు ప్ర‌క‌టించారు. ర‌తియాకు భార్య‌, ఇద్ద‌రు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు లాల్‌జిత్ సింగ్ ర‌తియా ధ‌రంజైగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు.

ప్ర‌ముఖ గిరిజ‌న నాయ‌కుడు చ‌నేష్ రామ్ ర‌తియా 1977లో అప్పటి అవిభక్త మధ్యప్రదేశ్‌లోని ధరంజైగర్ స్థానం నుంచి మొద‌టిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. తదనంతరం ఇదే స్థానం నుంచి ఆయ‌న వరుసగా మరో ఐదుసార్లు గెలుపొందారు. పూర్వ మధ్యప్రదేశ్‌లోని దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో చ‌నేష్‌ పశుసంవర్ధకశాఖ‌ మంత్రిగా పనిచేశారు. 2000లో ఛత్తీస్‌గడ్ ఏర్పడిన తరువాత అజిత్ జోగి ప్రభుత్వంలో (2000-2003) ఆహార, పౌర సరఫరాల‌శాఖ‌ మంత్రిగా పనిచేశారు.

Tags :

Advertisement