Advertisement

  • ఉత్కంఠ౦గా సాగిన పోరులో కోల్‌కతాపై చెన్నై విజయం

ఉత్కంఠ౦గా సాగిన పోరులో కోల్‌కతాపై చెన్నై విజయం

By: chandrasekar Fri, 30 Oct 2020 11:29 AM

ఉత్కంఠ౦గా సాగిన పోరులో కోల్‌కతాపై చెన్నై విజయం


దుబాయ్ స్టేడియంలో ఐపీఎల్‌ 2020లో భాగంగా గురువారం రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 173 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఓపెనర్‌ షేన్ వాట్సన్ 14 పరుగులకే పెవిలియన్ బాట పట్టినప్పటికీ.. రుతురాజ్‌ గైక్వాడ్‌ 72 పరుగులు: 53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. వరుసగా రెండో హాఫ్ సెంచరీతో గైక్వాడ్ రాణించాడు. అంబటి రాయుడు 38 పరుగులు : 20బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌) జట్టు స్కోర్ పెరగడంలో తన వంతు పాత్ర పోషించాడు. 19వ ఓవర్లో ఫెర్గుసన్‌ బౌలింగ్‌లో రవీంద్ర జడేజా ఒక ఫోర్‌, రెండు సిక్సర్లు బాది ఏకంగా 20 పరుగులు రాబట్టడంతో మ్యాచ్ గమనం మారిపోయింది. మొత్తంగా జడేజా (31 నాటౌట్:‌ 11 బంతుల్లో 2ఫోర్లు, 3సిక్సర్లు)లతో చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు. చివరి ఓవర్‌లో విజయానికి 10 పరుగులు అవసరం కాగా.. చివరి రెండు బంతుల్లో రవీంద్ర జడేజా వరుసగా రెండు భారీ సిక్సర్లు కొట్టి చెన్నైకి ( CSK ) దక్కదనుకున్న విజయాన్ని అందించాడు. కోల్‌కతా బౌలర్లలో స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి (2/20) రాణించగా.. ప్యాట్‌ కమిన్స్‌ రెండు వికెట్లు పడగొట్టాడు.

కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ విషయానికొస్తే.. ఓపెనర్‌ నితీశ్‌ రాణా (87: 61 బంతుల్లో 10ఫోర్లు, 4సిక్సర్లు) శుభారంభాన్నిచ్చాడు. శుభ్‌మన్‌ గిల్‌ 26 పరుగులు: 17 బంతుల్లో 4 ఫోర్లు), దినేశ్‌ కార్తీక్‌ ( 21 నాటౌట్:‌ 10 బంతుల్లో 3 ఫోర్లు) రాణించడంతో కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో లుంగి ఎంగిడి రెండు వికెట్లు పడగొట్టగా మిచెల్ శాంట్నర్‌, జడేజా, కర్ణ్‌ శర్మ చెరో వికెట్‌ తీశారు. బ్యాట్‌తో మెరుపులు మెరిపించిన రుతురాజ్ గైక్వాడ్‌ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ 5 మ్యాచ్‌లలో విజయం సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచినప్పటికీ.. పాయింట్స్ పట్టికలో మహేంద్ర సింగ్ ధోనీ సేన లాస్ట్ లోనే ఉండగా.. మరోవైపు ఆరు విజయాలతో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 5వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా ఓటమితో 13వ ఐపిఎల్ సీజన్‌లో ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది.

Tags :
|

Advertisement