Advertisement

భారీ వర్షాలకు చెరువుల్లా మారిన చెన్నై....

By: chandrasekar Thu, 29 Oct 2020 7:25 PM

భారీ వర్షాలకు చెరువుల్లా మారిన చెన్నై....


కరోనా నేపథ్యంలో గత ఆరేడు నెలలుగా అతలాకుతలం అయిన చెన్నైని ప్రస్తుతం వానలు ముంచెత్తాయి. బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు చెన్నై నగరంలోని అన్ని ప్రాంతాలు చెరువుల్లా మారాయి.

గురువారం ఉదయం నుంచి కురుస్తున్న వానలకు.. గత ఏడాది అనుభవాల కారణంగా ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ప్రజలు జీవిస్తున్నారు. మరో ఐదు రోజుల పాటు సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ శాఖ పేర్కొంది.

ఈశాన్య రుతుపవనాల రాకతో చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ ప్రాంతాలలో ఈశాన్య రుతుపవనాల కారణంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

నైరుతి రుతుపవనాలు సాధారణ తిరోగమనం తేదీకి 13 రోజుల తరువాత బుధవారం మొత్తం దేశం నుంచి వైదొలిగాయి. ఉత్తర తమిళనాడు తీరంలో దిగువన, మధ్య ట్రోపోస్పిరిక్ స్థాయిలలో నైరుతి బంగాళాఖాతంలో తుఫాను ప్రసరణ ఉన్నదని వాతావరణ శాఖ పేర్కొంది.

రాబోయే ఐదు రోజుల్లో కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరిలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయిని, వచ్చే రెండు రోజుల్లో దక్షిణ తమిళనాడు, దక్షిణ కేరళలో భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న నాలుగైదు రోజులలో దేశంలోని మిగిలిన ప్రాంతాలలో పొడి వాతావరణం ఉంటుందని భావిస్తున్నారు.

Tags :
|

Advertisement