Advertisement

  • కీలక పోరులో చెన్నై చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్

కీలక పోరులో చెన్నై చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్

By: Sankar Sun, 01 Nov 2020 7:48 PM

కీలక పోరులో చెన్నై చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్


ఈ రోజు ఐపీఎల్ 2020 లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది . ఇందులో టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లు ముగిసే సమయానికి మరో వికెట్ పడకుండా 153 పరుగులు చేసింది.

ఇందులో దీపక్ హుడా కేవలం 30 బంతుల్లో 4 సిక్స్ లు, 3 ఫోర్లతో 62 పరుగులు సాధించాడు. ఇక 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి వచ్చిన చెన్నై మొదటి నుండి విజయం వైపుకే పరుగులు తీసింది. ఓపెనర్ ఫాఫ్ డు ప్లెసిస్(48) పరుగుల వద్ద పెవిలియన్ కు చేరుకున్న తర్వాత వచ్చిన అంబటి రాయుడు (30) తో కలిసి మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (62) జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే ఈ రెండు జట్లకు ఇది ఐపీఎల్ 2020 లో చివరి మ్యాచ్.

ఇక ఇప్పటికే ప్లే ఆఫ్ రేస్ నుండి తప్పుకున్న చెన్నై పోతూ పోతూ పంజాబ్ ను కూడా ఇంటికి పట్టుకపోతుంది. ఎందుకంటే... ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే పంజాబ్ జట్టు కు ప్లే ఆఫ్ కు చేరుకునే అవకాశం ఉంది. కానీ ఆ జట్టు ఓడిపోవడంతో చెన్నై తో పాటుగా భారత్ కు తిరిగి రావాల్సిందే. అయితే చెన్నై జట్టు కు ఇది వరుసగా మూడో విజయం. ప్లే ఆఫ్ రేస్ నుండి తప్పుకున్న తర్వాత చెలరేగిపోయింది ధోని సేన.

Tags :

Advertisement