Advertisement

  • వచ్చే సీజన్ వేలంలో భారీ మార్పులు ఉంటాయి ..చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని

వచ్చే సీజన్ వేలంలో భారీ మార్పులు ఉంటాయి ..చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని

By: Sankar Mon, 02 Nov 2020 2:06 PM

వచ్చే సీజన్ వేలంలో భారీ మార్పులు ఉంటాయి ..చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని


ఐపీఎల్ 2020లో చెన్నై కథ ముగిసింది. చివరి మూడు మ్యాచ్‌‌ల్లో గెలిచిన ధోనీ సేన.. ఏడోస్థానంతో ఈ సీజన్‌ను ముగించింది. గత పది సీజన్లలో ప్లేఆఫ్ చేరిన చెన్నై.. ఈ సీజన్లో ఇంత పేలవంగా ఆడటం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ధోనీసేన ఓటములకు కారణాలు బోలెడు.. కానీ 2021లో ఈ తప్పిదాలకు ఆస్కారం ఇవ్వొద్దని ఫ్రాంచైజీ భావిస్తోంది. డాడీస్ ఆర్మీగా పేరొందిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు స్పష్టం అవుతుంది..

వచ్చే పదేళ్లను దృష్టిలో ఉంచుకొని జట్టులో మార్పులు చేయనున్నట్లు.. పంజాబ్‌తో మ్యాచ్ అనంతరం ధోనీ తెలిపాడు. వచ్చే సీజన్లో జట్టులో కొన్ని మార్పులు తప్పవని మహీ స్పష్టం చేశాడు. వచ్చే ఏడాది ఐపీఎల్ మెగా వేలం ఉండే అవకాశం లేదు. దీంతో వయసు మీదపడిన ఆటగాళ్లను రిలీజ్ చేసి యువకులను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. షేన్ వాట్సన్, పియూష్ చావ్లా, కేదార్ జాదవ్, మురళీ విజయ్‌లను వచ్చే సీజన్‌కు ముందు చెన్నై రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.

ఈ సీజన్లో ఆకట్టుకున్న రుతురాజ్ గైక్వాడ్, సామ్ కరన్ లాంటి యువ ఆటగాళ్లకు తోడుగా మరికొందరు యువ క్రికెటర్లు చెన్నై జట్టులో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే సీజన్లో ధోనీ సేన యువకులు, అనుభవం ఉన్న ఆటగాళ్ల కలబోతగా ఉండనుంది. ధోనీతోపాటు డుప్లెసిస్, జడేజా, రాయుడు లాంటి సీనియర్లు వచ్చే సీజన్లోనూ కొనసాగే ఛాన్స్ ఉంది.

Tags :
|

Advertisement