Advertisement

  • చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ ..గాయంతో స్టార్ ఆల్ రౌండర్ దూరం

చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ ..గాయంతో స్టార్ ఆల్ రౌండర్ దూరం

By: Sankar Mon, 19 Oct 2020 1:56 PM

చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ ..గాయంతో స్టార్ ఆల్ రౌండర్ దూరం


ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ లో నుండి ఐపీఎల్ 2020 ప్రారంభానికి ముందే ఆ జట్టు కీలక ఆటగాళ్లు సురేష్ రైనా, హర్భజన్ సింగ్ జట్టు నుండి తప్పుకున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు లేకపోవడంతో గత ఏడాది కంటే బ్యాటింగ్ లోను, బౌలింగ్ లోను కొంచెం వెనుకపడిపోయింది.

దాంతో ఈ ఏడాది ఐపీఎల్ లో చెన్నై ఇప్పటివరకు 9 మ్యాచ్ లు ఆడగా అందులో కేవలం 3 మాత్రమే విజయం సాధించింది. చెన్నై ఇలా వరుస పేలవ ప్రదర్శనలు చేయడంతో నిరాశకు గురవుతున్న ఆ జట్టు అభిమానులకు ఇప్పుడు మరో బ్యాడ్ న్యూస్... అదేంటంటే చెన్నై గత మ్యాచ్ ఢిల్లీతో ఆడినప్పుడు లాస్ట్ ఓవర్ బౌలింగ్ చేయకుండా మైదానం నుండి బయటకు వెళ్లిపోయిన 'బ్రావో' కోలుకోవడానికి చాలా సమయం పట్టనున్నట్లు తెలుస్తుంది.

ఇది ఆ జట్టుకు గట్టి దెబ్బ అనే చెప్పాలి. ఢిల్లీ తో బ్రావో చివరి ఓవర్ వేయకపోవడంతో ఆ మ్యాచ్ చెన్నై ఓడిపోయింది. అతని స్థానంలో బౌలింగ్ చేసిన జడేజా 18 పరుగులు ఇవ్వడంతో చెన్నై ఆరో ఓటమిని చవిచూసింది.ఐపీయల్ దిగ్గజ జట్లలో ఒకటైన చెన్నై వరుస పరాజయాలు పాలవడంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు..

Tags :
|
|

Advertisement