Advertisement

  • రాజస్థాన్ రాయల్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ ఘోరంగా పరాజయం... ప్లేఆఫ్‌కి చేరడం కష్టమే...

రాజస్థాన్ రాయల్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ ఘోరంగా పరాజయం... ప్లేఆఫ్‌కి చేరడం కష్టమే...

By: chandrasekar Tue, 20 Oct 2020 09:31 AM

రాజస్థాన్ రాయల్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ ఘోరంగా పరాజయం... ప్లేఆఫ్‌కి చేరడం కష్టమే...


రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఘోరంగా పరాజయం పొందింది దీంతో ప్లేఆఫ్‌కి చేరడం కష్టంగా మారింది. ఐపీఎల్ 2020 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తన ప్లేఆఫ్ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంది. అబుదాబి వేదికగా సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో తొలుత బౌలింగ్‌లో రాణించిన రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్‌ని 125/5కే పరిమితం చేసింది. ఆ జట్టులో రవీంద్ర జడేజా (35 నాటౌట్: 30 బంతుల్లో 4x4) టాప్ స్కోరర్‌కాగా రాజస్థాన్ బౌలర్లలో జోప్రా ఆర్చర్, కార్తీక్ త్యాగీ, శ్రేయాస్ గోపాల్, రాహుల్ తెవాటియా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం ఛేదనలో జోస్ బట్లర్ (70 నాటౌట్: 48 బంతుల్లో 7x4, 2x6) దూకుడుగా మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో లక్ష్యాన్ని 17.3 ఓవర్లలోనే రాజస్థాన్ రాయల్స్ 126/3తో సులభంగా ఛేదించేసింది. తాజా సీజన్‌లో 10వ మ్యాచ్ ఆడిన రాజస్థాన్‌కి ఇది నాలుగో విజయంకాగా చెన్నై సూపర్ కింగ్స్ ఏడో ఓటమి. దాంతో పాయింట్ల పట్టికలోనూ చెన్నై చిట్టచివరి స్థానానికి పరిమితమైంది. ఇక ఆ జట్టు మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచినా ప్లేఆఫ్‌కి చేరడం కష్టమే. మరోవైపు రాజస్థాన్ నాలుగో విజయంతో చిట్టచివరి (8వ) స్థానం నుంచి ఐదో స్థానానికి దూసుకెళ్లింది. ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ చెన్నై టీమ్ ఆడిన ప్రతి సీజన్‌లోనూ ప్లేఆఫ్‌కి చేరిన విషయం తెలిసిందే. వాస్తవానికి 126 పరుగుల ఛేదనలో రాజస్థాన్ రాయల్స్‌కి మెరుగైన ఆరంభం లభించలేదు. తొలిత వికెట్లు పోగుట్టుకున్నా తరువాత పుంజుకుంది.

రాజస్థాన్ ఇన్నింగ్స్ ప్రారంభించిన రాబిన్ ఉతప్ప (4), బెన్ స్టోక్స్(19)తో పాటు మూడో స్థానంలో బ్యాటింగ్‌కి వెళ్లిన సంజు శాంసన్ (0) కూడా వరుసగా 3, 4, 5 ఓవర్లలో పేలవంగా వికెట్ చేజార్చుకున్నారు. దాంతో 28/3తో నిలిచిన రాజస్థాన్‌ని చెన్నై టీమ్ ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేసినా జోస్ బట్లర్, స్టీవ్‌స్మిత్ (26 నాటౌట్: 34 బంతుల్లో 4x4) సమయోచితంగా బ్యాటింగ్ చేసింది. నాలుగో వికెట్‌కి అజేయంగా 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీ రాజస్థాన్‌కి 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందించింది. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ రెండు, హేజిల్ వుడ్ ఒక వికెట్ పడగొట్టాడు. మ్యాచ్‌లో అంతకముందు టాస్ గెలిచిన ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. శామ్ కరన్‌ (22: 25 బంతుల్లో 1x4, 1x6)తో కలిసి చెన్నై ఇన్నింగ్స్ ఆరంభించిన డుప్లెసిస్ (10: 9 బంతుల్లో 1x4) మూడో ఓవర్‌లోనే వికెట్ చేజార్చుకోగా అనంతరం వచ్చిన షేన్ వాట్సన్ (8), అంబటి రాయుడు (13) నిరాశపరిచారు. మ్యాచ్ లో 10 ఓవర్లు ముగిసే సమయానికి చెన్నై 56/4తో నిలిచింది. ఈ దశలో రవీంద్ర జడేజాతో కలిసి ఇన్నింగ్స్ నిర్మించిన మహేంద్రసింగ్ ధోనీ (28: 28 బంతుల్లో 2x4) ఐదో వికెట్‌కి 51 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో లేని పరుగు కోసం ప్రయత్నిస్తూ ధోనీ రనౌటవగా ఆఖర్లో కేదార్ జాదవ్ (4 నాటౌట్: 7 బంతుల్లో) మంచి ఆట ఆడలేకపోయాడు. అయినప్పటికీ జడేజా కాస్త బ్యాట్ ఝళిపించడంతో చెన్నై 125 పరుగులైనా చేయగలిగింది. బాటింగ్ లో చెన్నై పూర్తిగా విఫలమైనది.

Tags :
|

Advertisement