Advertisement

  • జూలు విదిల్చిన చెన్నై సూపర్ కింగ్స్ ..కింగ్స్ ఎలెవన్ పై పది వికెట్ల విజయం

జూలు విదిల్చిన చెన్నై సూపర్ కింగ్స్ ..కింగ్స్ ఎలెవన్ పై పది వికెట్ల విజయం

By: Sankar Mon, 05 Oct 2020 09:37 AM

జూలు విదిల్చిన చెన్నై సూపర్ కింగ్స్ ..కింగ్స్ ఎలెవన్ పై పది వికెట్ల విజయం


ఐపీయల్ ౨౦౨౦ టైటిల్ ఫేవెరెట్లలో ఒకటయిన చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా ఓటములు చవి చూడటం చెన్నై ఫాన్స్ కె కాక , మామూలు ఫాన్స్ కు కూడా రుచించడం లేదు ..ఇంతవరకు ఎప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ ను ఎవరు ఈ పరిస్థితిలో చూడలేదు..అందుకే అందరు చెన్నై సూపర్ కింగ్స్ తన స్థాయి విజయం కోసం ఎదురు చూసారు ..అయితే నిన్న రాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఫాన్స్ తమ జట్టు నుంచి ఎలాంటి ప్రదర్శన ఆశిస్తున్నారో సరిగ్గా అలంటి ప్రదర్శనే చేసి ఫామ్ లోకి వచ్చి ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపింది..

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై 179 రన్స్‌ టార్గెట్‌ను ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా ఛేదించింది. దీంతో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌.. వార్‌ వన్‌ సైడ్‌ అన్నట్టుగా సాగింది. పంజాబ్‌ పెట్టిన 179 పరుగుల టార్గెట్‌ను చెన్నై వికెట్‌ నష్టపోకుండా పూర్తి చేసింది. షేన్‌వాట్సన్‌ 53 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సులతో 83 పరుగులు చేశాడు. డుప్లెసిస్‌ 53 బాల్స్‌లో 87 రన్స్‌ చేశాడు. దీంతో చెన్నై తరఫున అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యం.. ఈ ఇద్దరి పేరిట నమోదైంది. వీరిద్దరి బ్యాటింగ్‌ కారణంగా.. భారీ లక్ష్యాన్ని సైతం ఈజీగా ఛేదించింది చెన్నై.

అంతకుముందు పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌ మరోసారి శుభారంభం చేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించారు. మయాంక్‌ అవుటయ్యాక.. మన్‌దీప్‌ సింగ్‌తో కలిసి ధాటిగా ఆడాడు రాహుల్. 94 రన్స్‌ వద్ద మన్‌దీప్‌ అవుటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన నికోలస్‌ పూరన్‌.. 17 బంతుల్లో ఒక ఫోర్‌, మూడు సిక్సులతో 33 రన్స్‌ చేశాడు. ఆపై జట్టు స్కోర్‌ 152 పరుగుల వద్ద పూరన్‌, రాహుల్‌ వరుస బంతుల్లో ఔటయ్యారు. చివర్లో మాక్స్‌వెల్‌, సర్ఫరాజ్‌ ఖాన్.. దూకుడుగా ఆడలేకపోయారు. చెన్నై ముందు 179 పరుగుల లక్ష్యాన్నే ఉంచగలిగారు. చెన్నై బౌలర్లలో శార్దుల్‌ ఠాకుర్‌ రెండు వికెట్లు తీయగా, జడేజా, చావ్లా చెరో వికెట్‌ తీశారు.

Tags :
|
|

Advertisement