Advertisement

  • ఎనిమిది నెలల తర్వాత సందర్శకుల కోసం తెరిచిన చెన్నై మెరీనా బీచ్

ఎనిమిది నెలల తర్వాత సందర్శకుల కోసం తెరిచిన చెన్నై మెరీనా బీచ్

By: chandrasekar Tue, 15 Dec 2020 10:29 AM

ఎనిమిది నెలల తర్వాత సందర్శకుల కోసం తెరిచిన చెన్నై మెరీనా బీచ్


దేశంలో కరోనా వైరస్ విజృంభించడంతో గత మార్చి నెల చివరి నుండి అన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలు పరిచిన విషయం అందరికీ తెలిసిందే. లాక్ డౌన్ ప్రకటించడంతో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ కార్యాలయాలు, అన్ని విద్యాసంస్థలు, షాపింగ్ మాల్ లు, సినిమా థియేటర్ లు , పర్యాటక ప్రదేశాలు, పార్కులు, బీచ్లు అని కూడా మూత పడిన విషయం తెలిసిందే. వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంకోసం కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది.

ప్రస్తుతం దేశంలో కరోనా ఉధృతి తగ్గడంతో పాటు ఆర్థిక మందగమనం అధిరోహించడానికి నిబంధనలను సడలిస్తూ ప్రభుత్వం అన్ లాక్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలలు, షాపింగ్ మాల్, సినిమా హాల్, పర్యాటక ప్రదేశాలు, పార్కులు, బీచ్లు పునఃప్రారంభం కాబడిన విషయం అందరికీ తెలిసిందే.

దీంతో చెన్నైలోని మెరీనా బీచ్ మళ్లీ సందర్శకుల కోసం సందడి చేయడం మొదలైంది. ఇప్పుడు బీచ్లో సందర్శకులను అనుమతించడంతో జనాలతో కిటకిటలాడుతుంది. ఇటు పిల్లలు యువకులు వృద్ధులతో పాటు కుటుంబ సమేతంగా అందరూ బీచ్ కి రావడంతో సందర్శకుల సందడి మొదలయ్యింది. ఇక్కడ అందరూ సరదాగా గడుపుతున్నారు.

Tags :
|
|

Advertisement