Advertisement

  • ఎమ్మెల్యే ప్ర‌భు ప్రేమ వివాహం చెల్లుతుంద‌న్న చెన్నై హైకోర్టు

ఎమ్మెల్యే ప్ర‌భు ప్రేమ వివాహం చెల్లుతుంద‌న్న చెన్నై హైకోర్టు

By: chandrasekar Fri, 09 Oct 2020 5:33 PM

ఎమ్మెల్యే ప్ర‌భు ప్రేమ వివాహం చెల్లుతుంద‌న్న చెన్నై హైకోర్టు


పోయిన వారం ఎమ్మెల్యే ప్రేమవివాహం చేసుకోవడంతో వార్త పెనుదుమారం లేపింది. దీంతో త‌మిళనాడుకు చెందిన‌ అన్నాడీఎంకే ఎమ్మెల్యే ప్ర‌భు ప్రేమ వివాహం చెల్లుతుంద‌ని మ‌ద్రాస్ హైకోర్టు స్ప‌ష్టంచేసింది. దీంతో ఈ కేసులో ప్ర‌భుకు ఊర‌ట ల‌భించిన‌ట్ల‌య్యింది. ఎమ్మెల్యే ప్ర‌భు ఐదు రోజుల క్రితం సౌంద‌ర్య అనే యువ‌తిని ప్రేమ వివాహం చేసుకున్నాడు.

ప్రేమ వివాహమాడిన ఎమ్మెల్యే‌ ద‌ళితుడు కావ‌డంతో బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన‌ సౌంద‌ర్య త‌ల్లిదండ్రులు పెండ్లికి ఒప్పుకోలేదు. ఈ క్ర‌మంలో ప్ర‌భు యువ‌తిని తీసుకెళ్లి సోమ‌వారం ఉద‌యం ర‌హ‌స్యంగా వివాహం చేసుకున్నాడు. దీంతో అమ్మాయి తండ్రి ఎమ్మెల్యే ఇంటి ముందు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశాడు.

దీంతో ఆ ప్ర‌య‌త్నం విఫ‌లం కావ‌డం వల్ల ఎమ్మెల్యే త‌న కూతురు సౌంద‌ర్య‌ను కిడ్నాప్ చేసి, బెదిరించి వివాహం చేసుకున్నాడని యువ‌తి తండ్రి స్వామినాథ‌న్ మద్రాస్ హైకోర్టులో పిటిష‌న్ వేశాడు. ఈ పిటిష‌న్‌పై విచారించిన న్యాయ‌స్థానం స్వామినాథ‌న్ ఆరోప‌ణ‌ల‌పై సౌంద‌ర్య‌ వివ‌ర‌ణ కోరింది.

కోర్టు విచారణలో నన్ను ఎవ‌రూ కిడ్నాప్ చేయ‌లేద‌ని, ఇష్ట‌పూర్వ‌కంగా వివాహం చేసుకున్నాన‌ని ఆమె చెప్ప‌డంతో కోర్టు స్వామినాథ‌న్ పిటిష‌న్‌ను తోసిపుచ్చింది. ఎమ్మెల్యే ప్ర‌భు ప్రేమ వివాహం చెల్లుతుంద‌ని హైకోర్టు స్ప‌ష్టంచేసింది. వ‌ధూవ‌రులిద్ద‌రూ మేజ‌ర్లేన‌ని, పైగా వారిద్ద‌రూ ఇష్ట‌పూర్వ‌కంగానే వివాహం చేసుకున్న‌ట్లు తెలిపార‌ని, అందువ‌ల్ల వారి వివాహం చ‌ట్ట ప్ర‌కారం చెల్లుబాటు అవుతుంద‌ని కోర్టు వెల్ల‌డించింది.

Tags :

Advertisement