Advertisement

తిరుమల ఘాట్ రోడ్ లో మళ్ళీ చిరుత దాడి

By: Sankar Sun, 09 Aug 2020 12:26 PM

తిరుమల ఘాట్ రోడ్ లో మళ్ళీ చిరుత దాడి



సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన తిరుమల తిరుపతి దేవస్థానంలో అప్పుడప్పుడు చిరుత దాడులు అన్న న్యూస్ వింటూనే ఉంటాము ..అయితే ఇటీవల కాలంలో అలంటి న్యూస్ కొంచెం తగ్గాయి అనుకుంటున్నా తరుణంలో మళ్ళీ చిరుత దాడులు జరుగుతుండటం భక్తులలో ఆందోళన రేకెత్తిస్తుంది..

చిరుత సంచారం భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఘాట్ రోడ్డులో వెళ్లే వాహనదారులపై ఒక్కసారిగా దాడి చేస్తోంది. ఒకే రోజు వరుసగా మూడు సార్లు చిరుత పంజా విసిరింది. ద్విచక్ర వాహనదారులు త్రుటిలో చిరుత దాడి నుంచి తప్పించుకున్నారు. తిరుమల క్షేత్రంలో ఎన్నడు లేని విధంగా చిరుత దాడికి దిగుతుండటంతో టీటీడీ అధికారులు, భక్తులకు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

శేషాచలం అటవీ ప్రాంతం అంటేనే ఎన్నో క్రూరమృగాలకు నెలవు. అయితే లాక్ డౌన్ వల్ల తిరుమల క్షేత్రంలో జన సంచారం పెద్దగా లేకపోవడంతో జంతువులన్నీ రోడ్లపైకి వచ్చేస్తున్నాయి. తాజాగా, ఓ చిరుత తిరుమలలోని రెండో ఘాట్ రోడ్డులో ప్రత్యక్షమైంది.

మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వాహనదారుడిపై అలిపిరి టోల్ గేట్ నుంచి సరిగ్గా నాలుగు కిలోమీటర్ల దూరంలో దాడి చేసింది. ఆ తర్వాత అక్కడే కూర్చుండి పోయింది. మరో ఇద్దరు వేర్వేరు ద్విచక్రవాహనాల్లో వెళుతుండగా వారిపై కూడా దాడి చేసింది. వీరిలో ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు కూడా ఉన్నారు. వారు ఎలాగోలా తప్పించుకుని తిరుమలకు చేరుకున్నారు. అలిపిరి టోల్‌గేట్ నుంచి సరిగ్గా నాలుగు కిలో మీటర్ల దూరంలో చిరుత ఉందనే సమాచారం టీటీడీతో పాటు అటవీశాఖ అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో అటవీ శాఖాధికారులు రంగంలోకి దిగారు.

Tags :

Advertisement