Advertisement

  • ధరకు తగ్గ స్మార్ట్ ఫోన్ సేల్ తేదీ వచ్చేసింది ....Poco M2 Pro

ధరకు తగ్గ స్మార్ట్ ఫోన్ సేల్ తేదీ వచ్చేసింది ....Poco M2 Pro

By: Dimple Fri, 17 July 2020 4:03 PM

ధరకు తగ్గ స్మార్ట్ ఫోన్ సేల్ తేదీ వచ్చేసింది ....Poco M2 pro


తాజాగా లాంచ్ చేసిన పోకో ఎం2 ప్రో స్మార్ట్ ఫోన్ తర్వాతి సేల్ జులై 30వ తేదీన జరగనుంది. ఈ విషయాన్ని పోకో ఇండియా ట్వీట్ ద్వారా తెలిపింది. ఈ షియోమీ సబ్ బ్రాండ్ కు చెందిన స్మార్ట్ ఫోన్ సేల్ మొదటగా జులై 14వ తేదీన జరిగింది. ఇప్పుడు తర్వాతి సేల్ జులై 30వ తేదీన జరగనుంది. పోకో ఎఫ్1, ఎకో ఎక్స్2 తర్వాత మనదేశంలో లాంచ్ అయిన మూడో పోకో ఫోన్ ఇదే. ఇందులో పంచ్ హోల్ డిస్ ప్లేను అందించారు. వెనకవైపు నాలుగు కెమెరాల సెటప్ కూడా ఉంది. రియల్ మీ 6, గెలాక్సీ ఎం21 స్మార్ట్ ఫోన్లకు ఈ ఫోన్ ప్రధాన పోటీ కానుంది.

పోకో ఎం2 ప్రో ధర

పోకో ఎం2 ప్రోలో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999గా ఉంది. 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.14,999గానూ, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.16,999గానూ నిర్ణయించారు. అవుట్ ఆఫ్ ద బ్లూ, గ్రీన్ అండ్ గ్రీనర్, టూ షేడ్స్ ఆఫ్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. జులై 14వ తేదీన దీని మొదటి సేల్ లో సెకన్ల వ్యవధిలోనే అన్ని ఫోన్లూ అమ్ముడుపోయాయి.

పోకో ఎం2 ప్రో స్పెసిఫికేషన్లు

ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు. డిస్ ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9 కాగా, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ 5 కూడా ఇందులో ఉండటం విశేషం. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను ఫోన్ పక్కభాగంలో అందించారు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 720జీ ప్రాసెసర్ పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది.

ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాల సెటప్ ను అందుబాటులో ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్, 5 మెగా పిక్సెల్ మాక్రో షూటర్ లను కూడా ఇందులో అందించారు. సెల్ఫీల కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ గా ఉంది. 33W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని ఇందులో అందించారు. ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 11 ఆపరేటింగ్ సిస్టంపై పోకో ఎం2 ప్రో పనిచేయనుంది. 4జీ, వైఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్ బీ టైప్-సీ పోర్టు కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.


Tags :
|
|
|

Advertisement