Advertisement

  • అక్షయ్‌ సినిమా ‘లక్ష్మీబాంబ్‌' చిత్ర టైటిల్‌లో మార్పులు...

అక్షయ్‌ సినిమా ‘లక్ష్మీబాంబ్‌' చిత్ర టైటిల్‌లో మార్పులు...

By: chandrasekar Fri, 30 Oct 2020 1:52 PM

అక్షయ్‌ సినిమా ‘లక్ష్మీబాంబ్‌' చిత్ర టైటిల్‌లో మార్పులు...


‘లక్ష్మీబాంబ్‌' చిత్రం లో అక్షయ్‌కుమార్‌ కథానాయకుడిగా నటిస్తున్నాడు. చిత్ర టైటిల్‌పై శ్రీరాజ్‌పుత్‌ కర్నీసేన అభ్యంతరం వ్యక్తం చేయడంతో టైటిల్ లో మార్పులు చేశారు. ఈ సినిమాను ‘లక్ష్మీ’ పేరుతో విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. లక్ష్మీబాంబ్‌' టైటిల్‌పై శ్రీరాజ్‌పుత్‌ కర్నీసేన అభ్యంతరం వ్యక్తంచేసింది. హిందు దేవతను, మత విశ్వాసాల్ని కించపరిచేలా, అభ్యంతరకరంగా టైటిల్‌ ఉందంటూ కర్నీసేన చిత్రబృందానికి లీగల్‌ నోటీసులు జారీచేసింది. సినిమా పేరును మార్చాలంటూ డిమాండ్‌ చేసింది.

కర్నీసేన అభ్యంతరాలతో చిత్రబృందం సినిమా పేరును ‘లక్ష్మీ’గా మార్చింది. తమిళ చిత్రం ‘కాంచన’ ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి రాఘవ లారెన్స్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కియారా అద్వాణీ కథానాయికగా నటిస్తోంది. ఓటీటీ ద్వారా నవంబర్‌ 9న ఈ చిత్రం విడుదలకానుంది.

Tags :
|

Advertisement