Advertisement

  • ఇస్మార్ట్ శంకర్ కు మద్దతుగా నిలిచిన చంద్రబాబు..

ఇస్మార్ట్ శంకర్ కు మద్దతుగా నిలిచిన చంద్రబాబు..

By: Sankar Mon, 17 Aug 2020 4:22 PM

ఇస్మార్ట్ శంకర్ కు మద్దతుగా నిలిచిన చంద్రబాబు..


టాలీవుడ్ హీరో రామ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు మద్దతు తెలిపారు. రామ్‌పై విజయవాడ ఏసీపీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కాలరాయడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చని ఒక ప్రకటన విడుదల చేశారు. ట్వీట్ పెట్టడం విచారణకు అడ్డుపడటంగా నోటీసులు ఇస్తామని బెదిరించడంపై మండిపడ్డారు.

రాష్ట్రంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఏవిధంగా కాలరాస్తున్నారో అనడానికి ఇది మరో రుజువని.. రాష్ట్రంలో ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నారు అన్నారు. మాట్లాడే స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని.. ప్రశ్నించే గొంతును అణిచేయాలని చూడటం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా చంద్రబాబు అభివర్ణించారు.

విజయవాడ స్వర్ణప్యాలెస్ అగ్ని ప్రమాద దుర్ఘటనకు సంబంధించి విచారణకు ఆటంకం కలిగిస్తే ఎలాంటివారికైనా నోటీసులు ఇవ్వడానికి వెనుకాడబోమని ఏసీపీ సూర్యచంద్రరావు తేల్చి చెప్పారు. ఈ మేరకు ఏసీపీ సూర్యచంద్రరావు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..

‘‘స్వర్ణప్యాలెస్ దుర్ఘటనలో రమేష్ ఆసుపత్రి యాజమాన్య వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నాం. ఇప్పటి వరకు డాక్టర్లు మమత, సౌజన్యను విచారించాం. విచారణకు ఆటంకం కలిగిస్తే హీరో రామ్‌కి కూడా నోటీసులు జారీ చేస్తాం’’ అని హెచ్చరించారు.ట్వీట్లు, ఆడియో టేపులు పంపటం మాని ఆధారాలు ఉంటే విచారణకు హాజరు కావాలని హీరో రామ్‌తో పాటు డాక్టర్ రమేష్‌కు ఏసీపీ సూర్యచంద్రరావు చురకలంటించారు.

Tags :

Advertisement